నాని ఈ ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వి సినిమాకు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. దానికి తోడు ఈ ఏడాది కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన నాని ఈ గ్యాప్ ను ఫిల్ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల చేయాలని భావించాడు. ఇప్పటికే టక్ జగదీష్ ను పూర్తి చేసిన నాని మరో వైపు రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఉండగానే 'అంటే సుందరానికి' అనే సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో నాని మరో సినిమాకు ఓకే చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాతే నాని తదుపరి సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. కాని నాని వద్దకు మారుతి వెళ్లడంతో కాదనలేక పోయాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మారుతి అడగడంతో నో చెప్పలేక వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంతకు ముందే కూడా మారుతితో సినిమాను నాని మొదలు పెట్టే అవకాశం ఉంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా మొదలు అవ్వాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమా మొత్తానికే క్యాన్సిల్ అయ్యిందో లేదా ఇది వేరే కథనో తెలియదు కాని నానితో యూవీ క్రియేషన్స్ లోనే మారుతి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వరుస సినిమాలు చేస్తున్న ఇంత బిజీలో మారుతితో సినిమాకు ఓకే చెప్పాడు అంటే ఆయనపై నానికి ఉన్న నమ్మకం ఏంటో అర్థం అవుతుంది.