ఒకప్పుడు సినిమాకు కెప్టెన్ దర్శకుడు అనేవారు. దర్శకుడు ఏది చెబితే అదే రైట్. ఒక్క పాయింట్ కూడా మార్చడానికి ఎవ్వరికి అధికారం ఉండేది కాదు. ఇప్పటికి కూడా కొంత మంది అలాంటి వారు ఉన్నారు. కానీ కొంత మంది దర్శకులు మాత్రమే. క్రేజ్ అంతా హీరోకి వచ్చే సరికి దర్శకుడి రేంజ్ కొంత తగ్గుతుందనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇకపోతే రీసెంట్ గా నాని నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం ప్రేక్షకులే అంటున్నాడు. అంతే కాకుండా దర్శకుల గురించే కూడా చెప్పాడు.
సగటు ప్రేక్షకుడు ఎప్పుడైనా సరే హీరోని అలాగే ఇతర నటీనటులు ఎవరనే విషయాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తాడు. దాదాపు 95% అలానే ఉంటుంది. అంతే గాని సెట్ లను అలాగే బ్యాక్ గ్రౌండ్ టెక్నీషియన్లను కాదని చెప్పాడు. మెయిన్ గా ఆ కథకు హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడా లేదా అనేదే మెయిన్ పాయింట్. నన్ను జనాలు ఆదరించారు అనే పాయింట్ లో చెప్పాడు. ముందు అభిమానులు అనే స్థాయిలో నాని తన ప్రేమను చాటుకున్నాడు.
ఎందుకంటే తన కెరీర్ లో చాలా హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించింది దాదాపు కొంచెం చిన్న దర్శకులే. డైరెక్టర్ ఎవరా అని ప్రేక్షకులు నా సినిమాను చూడలేదు. నాపై అభిమానంతో ఆ విధంగా ఆలోచించకుండా ఆదరించారు. గొప్ప పేరున్న దర్శకులతో అవకాశాలు వచ్చినప్పటికీ కథలు నచ్చక రిజెక్ట్ చేశాను. కథ నాకు చాలా ముఖ్యమని..పెద్ద దర్శకుల సినిమాలు కూడా బోల్తా కొడుతున్నాయని నాని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొత్తంగా నాని ముందు అభిమానులే నా సక్సెస్ కి కారణం అని చెప్పాడు.