ఆస్తుల కంటే బంధాలు గొప్పవి అని చెబుతూ తీసిన ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. పాతవాసనలతో ఫక్తు ఫార్ములాతో తీసిన ఈ చిత్రానికి ఫర్వాలేదనే టాక్ వినిపించింది. ప్రస్తుతం టక్ జగదీష్ ప్రమోషన్స్ ని నాని ఆస్వాధిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని కొన్ని సరదా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దళపతి విజయ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో ఎలివేటర్ లో చిక్కుకుంటే వారికి ఏమి చెబుతావు? అని ప్రశ్నిస్తే.. ఆ ఇద్దరితో ``మీరు ఎందుకు మాట్లాడకూడదు గయ్స్.. నేను వినాలనుకుంటున్నాను`` అని చెబుతానని సరదాగా అన్నాడు.
ఫహద్ ఫాసిల్ .. అనుష్క శెట్టిని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న ఏమిటి అని నానీని ప్రశ్నించగా.. ఫహద్ ఫాజిల్ ని అయితే ``తరువాత ఎప్పుడు కలుస్తాం?`` అని అడుగుతాను. అనుష్క శెట్టి ని అయితే..``ట్రైలర్ విడుదలైనప్పటి నుండి మీరు నాకు ఎందుకు మెసేజ్ చేయలేదు?`` అని అడిగేస్తాను అని అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ లో దేనిని మార్చాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు నాని నిజాయితీగా స్పందించారు. ``నేను దీనిపై చెప్పగలనో లేదో నాకు తెలియదు.. కానీ చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. చాలాసార్లు సినిమా కళాకారుల సంఘాలు... సమావేశాలు.. ఎన్నికల పేరుతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇది చాలా అనారోగ్యకరమైనది!! అని నేను అనుకుంటున్నాను. ఈ ధోరణిలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా దానిని నిలిపివేస్తారని నేను ఆశిస్తున్నాను.. అని నాని చెప్పాడు.