గజదొంగగా నాని?

Update: 2018-06-07 07:36 GMT
బయోపిక్ అంటే ఈ రోజుల్లో జనాలు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు. జీవిత కథలను చూపిస్తే మంచి బిజినెస్ తో పాటు గుర్తింపు కూడా దక్కుతోందని సినిమా వాళ్లు ఎక్కువగా బయోపిక్ లపై శ్రద్ధ వహిస్తున్నారు. ఒక మంచి టీమ్ సెట్ అయితే హీరోలు కూడా డౌట్ లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల మహానటి సినిమా టాలీవుడ్ లో కూడా బయోపిక్ లు అద్భుత విజయాన్ని అందుకుంటాయని చెప్పేసింది.

ఇకపోతే రానున్న రోజుల్లో మరిన్ని బయోపిక్ లు తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానా రెండు బయోపిక్ లకు సైన్ చేశాడనే ఇదివరకే న్యూస్ లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల కథలే ఆ బయోపిక్ లు. కుస్తీ పోటీలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కోడి రామ మూర్తి నాయుడు. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు కథలకు రానా ఒకేశాడు.

అయితే అందులో టైగర్ నాగేశ్వర రావు కథను రానా కొన్ని కారణాల వల్ల వదిలేయగా చివరికి నాని వద్దకు వచ్చి చేరిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టువర్ట్ పురం గజదొంగ 1970 లలో చాలా ఫెమస్. బ్యాంకులను దొంగిలించి అందరిని షాక్ కి గురి చేశాడు. ఫైనల్ గా 1987 లోని ఒక భారీ ఎన్ కౌంటర్ లో అతను మృతి చెందాడు. ఆ పాత్రలో నాని కనిపించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా దర్శకుడు వంశీ కృష్ణ ఈ బయోపిక్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  
Tags:    

Similar News