మొదటి వేవ్ కంటే రెండో వేవ్ లో లక్షలాది మంది మరణించారు. సెకండ్ వేవ్ లో 2 శాతం పిల్లలు ఆస్పత్రుల్లో చేరారు. తక్కువ ఏజ్ లో యువకులు కూడా మరణించడం కలవరపెట్టింది. ఇప్పుడు అన్ లాక్ ప్రక్రియలో థర్డ్ వేవ్ ముప్పు ఉందని డాక్టర్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్ పై నేచురల్ స్టార్ నాని నేరుగా ప్రముఖ డాక్టర్ సలహాలతో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. తల్లిదండ్రుల్లో అవాగాహన పెంచేందుకు డాక్టర్ శివరంజని ఇచ్చిన సలహాలు వినాలంటే ఈ వీడియో చాటింగ్ చూడాల్సిందే.
మొన్నటి వరకూ థర్డ్ వేవ్ లో పెద్దలతో పోలిస్తే పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అనుకున్నాం. ఒకవేళ వైరస్ ఇప్పటిలానే ప్రవర్తిస్తే పిల్లలకు ఇంతకంటే తీవ్రంగా రాదు. ఒకవేళ తీవ్రంగా వచ్చినా వందకు 98 మంది కిడ్స్ ఇంట్లోనే చికిత్స పొంది కోలుకునే అవకాశం ఉంటుంది. జ్వరం వాంతులు విరోచనాలతోనే ట్రీట్ మెంట్ కి సెట్ అయిపోతోంది. వందకు 2 శాతం మాత్రమే మొదటి రెండు వేవ్ లో పిల్లలు ఆస్పత్రుల్లో చేరారు. మూడో వేవ్ లో అలానే ఉంటుంది.
పిల్లలకు వచ్చినా కొంత శాతం పెరిగి వందకు 5 శాతం ఆస్పత్రుల్లో చేరుతారు. అయితే మనం ఆందోళన పడితే సాధించేదేమీ ఉండదు. కిడ్స్ పేరెంట్ అవగాహనతో సిద్ధంగా ఉంటే జాగ్రత్తగా ఉండగలరు. కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బిడ్డను కాపాడుకునేందుకు అవగాహనతో ఉండాలి. ఆందోళన వద్దు.. అని సూచించారు. సీనియర్ కిడ్స్ స్పెషలిస్ట్ విలువైన సలహాలను అందరూ పాటిస్తే ఉపయుక్తమే. ఇక నాని అండ్ క్రియేటివ్ టీమ్ కోవిడ్ సమయంలో జాగ్రత్తలపై ఇప్పటికే పలు వీడియోలను ప్రిపేర్ చేసి అవగాహన పెంచే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అతడు నటించిన టక్ జగదీష్ రిలీజ్ కి రావాల్సి ఉంది. శ్యామ్ సింఘరాయ్ సెట్స్ పై ఉంది. తదుపరి పలువురు దర్శకుల్ని లాక్ చేసి సెట్స్ కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. తీరిక సమయాల్లో నాని తనవంతుగా కోవిడ్ అవేర్ నెస్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.
Full View