తెలంగాణ యాసలో మాట్లాడబోతున్న న్యాచుర‌ల్ స్టార్...!

Update: 2020-05-23 13:00 GMT
న్యాచుర‌ల్ స్టార్ నాని వరుసగా సినిమాలను ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. మొదటి నుండి కూడా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు నాని. ఒక సినిమా ప్యాకప్ అవ్వగానే నెక్స్ట్ మూవీ సెట్లో ప్రత్యక్షం అవుతారు. అంత పగడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటాడు. ఇప్పటికే నాని నటించిన ‘వి’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తదుపరి సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేసాడు. ఈ సినిమా తర్వాత ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ డైరెక్షన్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ‌తో నాని ఒక సినిమా కమిట్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు నాని. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన శ్రీ‌కాంత్ ఓడెల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయ‌నున్నాడు. 'పడిపడి లేచెను మనసు' సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని యస్.యల్.వి బ్యానర్ పై నిర్మించ‌నున్నారని సమాచారం.

ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో సాగే రస్టిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇప్ప‌టికే నాని ఈ క‌థ విని ఇంప్రెస్ అయ్యారట. అంతేకాకుండా ఈ సినిమాలో నాని తెలంగాణ యాస‌లో మాట్లాడబోతున్నాడట. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌టంతో నాని కచ్చితంగా తెలంగాణ యాస‌లోనే మాట్లాడాల్సి ఉందట. ఇప్ప‌టికే నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో రాయ‌ల‌సీమ యాస‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'ట‌క్ జ‌గ‌దీష్' సినిమా గోదావరి జిల్లాల నేటివిటీతో తెరకెక్కబోతోందట. అంటే ఆ సినిమాలో గోదావరి జిల్లాల ప్రజలు మాట్లాడే యాస‌తో మాట్లాడబోతున్నాడన్నమాట. ఇప్పుడు ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకోబోతున్నాడని సమాచారం. మొత్తం మీద నాని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని యాసలను కవర్ చేస్తున్నాడని చెప్పవచ్చు. ప్ర‌స్తుతం 'ట‌క్ జ‌గ‌దీష్' కంప్లీట్ చేసే పనిలో ఉన్న నాని.. ఆ త‌ర్వాత రాహుల్ సంక్రీత్య‌న్, వివేక్ ఆత్రేయ సినిమాలు పూర్తైన త‌ర్వాత శ్రీ‌కాంత్ తో సినిమా ఉంటుందట. ఏదేమైనా నాని ఇలా వరుస సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
Tags:    

Similar News