ఈ ఏడాది కరోనా కారణంగా టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమాలు కూడా విడుదల వాయిదా పడ్డాయి. కొన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాని కూడా ఈ ఏడాది 'వి' సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతి ఏడాది రెండు సినిమాలను విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్న నాని ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది గ్యాప్ ను ఫిల్ చేసేందుకు వచ్చే ఏడాదిలో మూడు లేదా అంతకు మించి విడుదల చేయాలనే పట్టుదలతో నాని కనిపిస్తున్నాడు.
ఇప్పటికే నాని 'టక్ జగదీష్' ను పూర్తి చేశాడు. మరో వైపు శ్యామ్ సింగరాయ్ మరియు అంటే సుందరానికి సినిమాలను మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్ జరుగుతూ ఉంటాయని అంటున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాను కూడా నాని చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తంగా 2021లో మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సినిమాలతో నాని ఈజీగా 150 కోట్ల వసూళ్లను సాధించడం ఖాయం అంటున్నారు.
మూడు లేదా నాలుగు సినిమాల్లో కనీసం రెండు సినిమాలు సక్సెస్ అయినా కూడా నాని వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల ను దక్కించుకుంటాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. నాని అంటే సుందరానికి సినిమాను ఏకంగా 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీ 5 సిద్దంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన సినిమాల మార్కెట్ విలువ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన సినిమాలు కూడా ఆ రేంజ్ లో బిజినెస్ చేస్తే ఆయన వచ్చే ఏడాదిలో 150 కోట్లను క్రాస్ చేయడం చాలా అంటే చాలా సులభం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలన్ని కూడా సక్సెస్ అయితే ఆయన రూ.200 కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.