టాలీవుడ్ లో ప్రస్తుతం నాని గాలి బాగా వీస్తోంది. తన నటనతో మంచి హిట్స్ అందుకొని సూపర్ హిట్ ఛాన్సులను అందుకుంటున్నాడు. మొన్నటి వరకు డబుల్ హ్యాట్రిక్ తో దూసుకొచ్చిన నాని రీసెంట్ గా ఎంసీఏ సినిమాతో కొంచెం తడబడ్డాడు. ఇంకా లవ్ స్టోరీలేనా? అనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం కొత్తగా నవ్వించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎవరి సినిమాలు వచ్చినా సరే వెనక్కి తగ్గేది లేదు అనే విధంగా కృష్ణార్జున యుద్ధం తో సమ్మర్ ఎటాక్ కి సిద్దమవుతున్నాడు.
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొన్ని నెలల క్రితమే ఒక కథను ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఫైనల్ షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లో అయిపోతుంది. దీంతో సమ్మర్ హాలిడేస్ లోనే సినిమాను రిలీజ్ చేసి మళ్లీ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలను అనుకుంటున్నాడు. 2018 ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయడానికి కృష్ణార్జున యుద్ధం చిత్ర యూనిట్ సిద్దపడింది. అంతా బాగానే ఉంది కాని ఆ డేట్ ఇప్పుడు స్టార్ హీరోలనే చాలా భయపెడుతోంది. అసలు ఆ నెలలో రిలీజ్ చేయడం అంత మంచిది కాదు అనే విధంగా డైలమాలో పడ్డారు.
మహేష్ - భారత్ అనే నేను.. అల్లు అర్జున్ - నా పేరు సూర్యా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాలా వద్దా అని సతమతమవుతున్నాయి. ఎందుకంటే రజినీకాంత్ 2.0 28న రిలీజ్ అవుతుందా అనే విషయంపై అస్సలు క్లారిటీ లేదు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే దానికంటే వారం ముందు గాని లేక 15 రోజుల ముందుగాని సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎలాగూ ఇంకా టైమ్ ఉంది కాబట్టి మెల్లగా డేట్ ఫిక్స్ చేసుకోవచ్చులే అని అనుకుంటున్నారు. కానీ నాని మాత్రం రజినీ గురించి ఆలోచించాడో లేదో గాని డేట్ మాత్రం ఫిక్స్ చేసేశాడు. మరి న్యాచురల్ స్టార్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.