తన బేనర్లో దర్శకుడిగా పరిచయం అయితే.. సక్సెస్ తోనే బయటికి వెళ్లాలన్నది దిల్ రాజు సిద్ధాంతం. ఇలా చాలామంది దర్శకుల్ని సక్సెస్ ఇచ్చే బయటికి పంపించాడు రాజు. వంశీ పైడిపల్లి తొలి సినిమా ‘మున్నా’ ఫెయిలైనా సరే.. ఆ తర్వాత ‘బృందావనం’తో హిట్టు కొట్టించాడు. ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్ కు కూడా ఇలా ఓ హిట్టివ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. కానీ తొలి సినిమా విడుదలై చాలా ఏళ్లయినా వేణుకు మరో సినిమా సెట్టవ్వలేదు. గత ఏడాది రవితేజతో అనుకున్న సినిమా ముందుకు కదల్లేదు. ఎట్టకేలకు ఇప్పుడు నాని హీరోగా వేణు దర్శకత్వంలో ‘ఎంసీఏ’ అనే సినిమాకు శ్రీకారం చుట్టాడు రాజు.
‘ఎంసీఏ’ శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. రాజు బేనర్లో పని చేసిన హరీష్ శంకర్.. వంశీ పైడిపల్లి.. అనిల్ రావిపూడి.. త్రినాథ రావు లాంటి దర్శకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అనిల్ కెమెరా స్విచాన్ చేస్తే.. హరీష్ శంకర్ తొలి షాట్ కు దర్శకత్వం వహించాడు. వంశీ క్లాప్ కొట్టాడు. వేణు తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ 2011 నవంబర్లో రిలీజైతే.. అది వచ్చిన సరిగ్గా ఆరున్నరేళ్లకు ‘ఎంసీఏ’ ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం. తొలి సినిమా తర్వాత ఏ దర్శకుడికైనా ఇంత విరామం వస్తే ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో అంచనా వేయొచ్చు. మరి తన రెండో సినిమాలో వేణు ఎంత కసి చూపిస్తాడో చూడాలి. నాని సరసన సాయి పల్లవి నటించనున్న ఈ సినిమాకు ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించనున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/