నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `వి`..`టక్ జగదీష్` చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా నాని నటించిన ఆ రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ చేసారు. ఈ క్రమంలో నానిపై థియేటర్ యాజమాన్యాలు..డిస్ర్టిబ్యూటర్లు పెద్ద యుద్దమే ప్రకటించారు. ఇలా ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటే మేము ఏమైపోవాలని మండిపడ్డారు.
ప్రతిగా నాని అదే రేంజ్ లో రివర్స్ అయ్యారు. నిర్మాతల ఇష్ట ప్రకారమే ఓటీటీ రిలీజ్ జరిగినా ఆ సమయంలోనాని నిర్మాతల పక్షాన నిలబడటమే వ్యతిరేకతని తీసుకొచ్చింది. చివరికి ఆ వివాదం ఎలాగూ సద్దు మణిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి రావడంతో నాని నటించిన మరో సినిమా `శ్యామ్ సింగరాయ్` మాత్రం నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేసారు.
కానీ సినిమా అంచనాల్ని అందుకోలేదు. అయితే నాని తాజా సినిమా మాత్రం మరోసారి ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నాని నిర్మిస్తున్న సినిమా. ఆయన నిర్మాతగా `మీట్ క్యూట్` అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇది డిఫరెంట్ జానర్ సినిమా. ఇందులో శివ కందుకూరి..దీక్షిత్ శెట్టి-రుహానీ శర్మ-వర్ష బొల్లం నటిస్తున్నారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమా ఐదు విభిన్న కథనాలపై నడుస్తుంది. కంటెంట్ రొటీన్ కి భిన్నంగా ఉంటుందని సమాచారం. అందుకే నాని థియేటర్ రిలీజ్ ద్వారా రిస్క్ తీసుకోకుండా ముందుగానే ఓటీటీతో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ తో నాని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా నాని గానీ...సదరు ఓటీటీ గానీ ధృవీకరించలేదు. కాగా డౌట్ ఫుల్ కంటెంట్ ని నిర్మాతలు ముందుగానే ఓటీటీలోకి డంప్ చేస్తున్నారు.
పెట్టిన పెట్టుబడికి కొంత లాభం వస్తే చాలు అనుకుని అమ్మేస్తున్నారు. ఆ మధ్య ధనుష్ హీరోగా నటించిన రెండు సినిమాలు అలాగే అమ్మకం చేసారు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నారని అర్ధమైంది. థియేటర్ రిలీజ్ అయితే తీవ్ర నష్టాలు తప్పేవి కాదని విమర్శకులు ఓ రేంజ్ లో ఎక్కు పెట్టారు.
ఇక నాని ప్రొడక్షన్ వెంచర్ లో `హిట్: ది సెకెండ్ కేస్` నిర్మాణం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా నటిస్తోన్న `అంటే సుందరాకీ` జూన్ లో రిలీజ్ కానుంది. `దసరా` అనే మరో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.