నాని సినిమాలు ఫ్లైట్లో సూపర్ హిట్

Update: 2017-07-10 10:51 GMT
తన సినిమాలు థియేటర్లలోనే కాదు.. విమానాల్లోనూ సూపర్ హిట్ అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘నిన్ను కోరి’ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఓ టీవీ ఛానెల్ కు వచ్చిన నానికి ఓ అభిమాని ఫోన్ చేశాడు. నాని గురించి పొగడ్తలు గుప్పించేసి.. తాను ఎప్పుడు ఫ్లైట్లో వెళ్లినా నాని సినిమాలే చూస్తానని చెప్పాడు. విమానాల్లో హిందీకి సంబంధించి ప్రధానంగా అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ సినిమాలు ఉంటాయని.. కానీ తెలుగు విషయానికొస్తే మాత్రం ఎక్కువగా నాని సినిమాల కలెక్షనే ఉంటుందని అతను చెప్పాడు. ఆ అభిమాని చెప్పిన మాటలతో సంబరపడిపోయిన నాని.. ఇండస్ట్రీ జనాల నుంచి కూడా తాను ఈ మాట విన్నట్లు చెప్పాడు.

ఈ మధ్య ప్రకాష్ రాజ్ గారు కలిశారని.. ఆ సందర్భంగా తాను ‘మజ్ను’ సినిమాను ఫ్లైట్లో చూశానని.. బాగుందని చెప్పారని నాని తెలిపాడు. మామూలుగా తాను ఫ్లైట్లో సినిమాలు చూడనని.. ఐతే ‘మజ్ను’ సినిమా అందుబాటులో ఉండటంతో చూశానని ప్రకాష్ రాజ్ చెప్పినట్లు నాని వెల్లడించాడు. కాబట్టి నా సినిమాలు ఫ్లైట్లలో కూడా సూపర్ హిట్టన్నమాట అంటూ నవ్వేశాడు నాని. అతడి మాటలు అతిశయోక్తి ఏమీ కాదు. నాని బ్లాక్ బస్టర్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’ ఫ్లైట్లలో తెలుగు వాళ్లు అత్యధికంగా చూసిన సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. నాని గత రెండేళ్లలో నటించిన మిగతా సినిమాల్ని  విమాన ప్రయాణికులు బాగా చూస్తుంటారని సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తుంటాయి.

Tags:    

Similar News