భలే నాని.. బిజినెస్ అయిపోయింది

Update: 2015-11-08 08:52 GMT
ఇంకా పేరు కూడా పెట్టని సినిమా అది. షూటింగ్ కూడా ఇంకా పూర్తవలేదు. పైగా ఆ సినిమా తీస్తున్న నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన రెండు సినిమాలూ డిజాస్టర్లే. ఐతేనేం ఆ మూవీ బిజినెస్ అప్పుడే క్లోజ్ అయిపోయింది. ఇదంతా నేచురల్ స్టార్ నాని మహిమే. ఈ మధ్యే మనోడు ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఊపులోనే నాని కొత్త సినిమాకు బయ్యర్ల నుంచి బంపర్ ఆఫర్లు వచ్చాయి. దీంతో సినిమాకు పేరైనా పెట్టకముందే బిజినెస్ మొత్తం క్లోజ్ చేసేశారు 14 రీల్స్ నిర్మాతలు.

14 రీల్స్ బేనర్లో నాని హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూడు నెలల కిందట సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. మంచి టైమింగ్ చూసి డిసెంబర్ లోనో లేదంటే ఫిబ్రవరిలోనో సినిమాను రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. ఇంకో వారం రెండు వారాల్లో టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారట. ఐతే భలే భలే... తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో బయ్యర్లలో మంచి ఆసక్తి నెలకొంది. 14 రీల్స్ వాళ్లు దీనికి ముందు తీసిన 1 నేనొక్కడినే - ఆగడు పెద్ద డిజాస్టర్లయినప్పటికీ.. నాని సినిమాకు మాత్రం మంచి బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే బిజినెస్ క్లోజ్ చేశారట నిర్మాతలు.
Tags:    

Similar News