హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో ఏ స్థాయిలో జనాల్లో ఆసక్తిని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకున్నట్లుగానే ఆ చిత్రం ఇండియాలో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ మూవీ సాధించని రికార్డు స్థాయి వసూళ్లను ఆ చిత్రం రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమాను క్రాస్ చేసేలా 'లయన్ కింగ్' మూవీ రాబోతుంది. హాలీవుడ్ మూవీ అయిన 'లయన్ కింగ్' ఇండియాలో పలు భాషల్లో డబ్ అవుతుంది.
తెలుగులో ఈ చిత్రం కోసం నాని.. జగపతిబాబు.. అలీ.. బ్రహ్మానందం ఇంకా పలువురు ప్రముఖులు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో నాని పాల్గొన్నాడు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి కూడా హాలీవుడ్ సినిమాలను తెలుగు వర్షన్ లో కంటే ఒరిజినల్ వర్షన్ లోనే చూడటం ఇష్టం. లయన్ కింగ్ కు డబ్బింగ్ చెప్పమన్నప్పుడు కూడా నేను ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పినా ఒరిజినల్ వర్షన్ నే చూడాలని అనుకున్నాను.
డబ్బింగ్ మొదలు పెట్టబోతున్న సమయంలో 'లయన్ కింగ్' చిత్రాన్ని ఒరిజినల్ వర్షన్ చూశాను. ఆ తర్వాత అప్పటికే డబ్బింగ్ చెప్పిన కొన్ని సీన్స్ ఉంటే చూశాను. వాటికి బ్రహ్మానందం మరియు అలీగారు డబ్బింగ్ చెప్పారు. ఆ సీన్ చూస్తున్నంత సేపు చప్పట్లు కొడుతూ నవ్వుతూనే ఉన్నాను. ఆ పదినిమిషాల సీన్స్ అద్బుతంగా అనిపించాయి. వారి కోసం అయినా ఈ సినిమాను తెలుగులో చూడాలని నిర్ణయించుకున్నానంటూ నాని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ వేడుకలో నానితో పాటు అలీ కూడా పాల్గొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొట్టబోతుందో చూడాలి.