అ! హీరోయిన్స్ కి అంతే ఇచ్చాడట

Update: 2018-02-15 18:36 GMT
వరుస విజయలతో దూసుకుపోతోన్న నాని ఎక్కడా తగ్గడం లేదు. అలాగే తన మార్కెట్ ను కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా నాని నిర్మాతగా మరీనా సంగతి తెలిసిందే. పూర్తిగా తన బ్యాక్ గ్రౌండ్ తో అ! సినిమాను నిర్మించాడు. అ! సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని సినిమాలో నటించిన వారిని చుస్తే అర్ధమవుతోంది.

కాజల్ - నిత్యా మీనన్ - ఈషా రెబ్బా అలాగే రెజీనా వంటి స్టార్స్ సినిమాలో నటించడం మొదట అందరిని షాక్ కి గురి చేసింది. కొత్త దర్శకుడిని నమ్మి ఇంత పెద్ద తారాగణం చేతులు కలిపింది అంటే పక్కా సినిమా ఆడియెన్స్ కి ఎదో కొత్త ట్రీట్మెంట్ ఇవ్వబోతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే సినిమాలో నటించిన హీరోయిన్స్ కి నాని ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాడు అనేది ఓ విధంగా మొదట హాట్ టాపిక్ అయ్యింది.

అయితే వారు డిఫెరెంట్ సినిమా కావడంతో ఒప్పుకున్నారని ఇక టాక్ వచ్చింది. కాదు నాని వల్ల చేశారని మరొక టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే కొంచెం రెమ్యునరేషన్ ని తగ్గించారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే అలాంటి రిబేట్లు లాంటివి ఏమి లేవని నాని ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు. వారి మొత్తం రెమ్యునరేషన్ కి తగ్గట్టు ఒక కాల్షీట్ ఉంటుంది. అంటే ఒక 50 లేదా 40 రోజులు. కానీ అ! సినిమాకు అంత అవసరం లేదు కావున ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చారో అందుకు తగ్గటుగా ఇవ్వడం జరిగిందని నాని వివరించాడు.
Tags:    

Similar News