టాప్ హీరోలతో సమానంగా...

Update: 2017-10-31 08:17 GMT
స్టార్ హీరోలుగా ఎదగాలంటే కష్టపడే గుణతో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలని అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ లో కష్టపడి వచ్చిన హీరోలకన్నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలే ఎక్కువగా ఉన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా వారే ఎక్కువగా అందుకుంటున్నారు. ఏడాదికి ఒక్క సినిమాను చేస్తే చాలు 20 కోట్లకు పైగా అందుకోవచ్చు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వారి రెమ్యునరేషన్ లో అంతగా తేడాలు ఏమి రావట్లేదు.

అయితే అందరు ఏడాదికి ఒక్క సినిమాతోనే వస్తున్నారు. అవి కూడా ఒక్కోసారి హిట్ అయితే మరొకసారి ఫెయిల్ అవుతున్నాయి. కానీ న్యాచురల్ స్టార్ నాని మాత్రం సింపుల్ బడ్జెట్ తో సినిమాను తీసి బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకుంటున్నాడు. అంతే కాకుండా సినిమా సినిమాకి మనోడు రెమ్యునరేషన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఒక్క సినిమాకి 5-6 కోట్ల వరకు అందుకుంటున్నాడట. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ కుర్ర హీరో ఏడాదికి 3 సినిమాలను చేస్తున్నాడు.

దీంతో నాని ఖాతాలో ఏడాదికి 20 కోట్లకు పైగా జమవుతున్నాయి. అవి కూడా సక్సెస్ అవుతుండడడంతో నాని కొంచెం కొంచెంగా రెమ్యునరేషన్ ని పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాప్ హీరోలు ఒక్క సినిమాతో ఏడాదికి 20+ కోట్లవరకు అందుకుంటుంటే నాని కూడా 3 సినిమాలతో ఏడాదిలో 20 కోట్ల వరకు జమ చేసుకుంటున్నాడట. ఈ ఏడాది నేను లోకల్ - నిన్ను కోరితో హిట్ అందుకున్న నాని డిసెంబర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నాడు.
Tags:    

Similar News