ఒక రొటీన్ సినిమాకు డబ్బులొచ్చి హిట్టయితే కంటెంట్ పరిస్థితేంటి... అంటారు. అదే ఒక ప్రయోగాత్మక సినిమా చేసి ఆ సినిమాకు డబ్బులు రాకపోతే కంటెంట్ బాగుంది కానీ కలెక్షన్స్ ఏవి.. ? అంటారు. సరిగ్గా నేచురల్ స్టార్ నానికి ఇదే పరిస్థితి ఎదురైంది. 'ఎం.సి.ఏ' సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చాయి. కాకపోతే కంటెంట్ లో మైనస్ లున్నాయి. మొన్నీ మధ్యే 'జెర్సీ' అంటూ ఎమోషనల్ కంటెంట్ తో ఓ డిఫరెంట్ సినిమా చేసాడు. ఈ సినిమాకు మంచి రివ్యూ లొచ్చాయి. కానీ కొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. దాంతో 'జెర్సీ' పెద్దగా ఆడలేదు అనే టాక్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ విషయంపై స్పందించాడు నాని.
'జెర్సీ' విషయంలో నేను ఎక్స్ ట్రీంలీ హ్యాపీ. తెలుగు సినిమాకు ఉన్న కొన్ని పరిధులు దాటి మేము చేసిన ప్రయోగమది. సినిమా వరల్డ్ వైడ్ గా ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. నిజానికి థియేట్రికల్ రైట్స్ - రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్ బాగానే వచ్చాయి. ఇప్పుడు చైనాలో కూడా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే మేకర్స్ కు 'జెర్సీ' మంచి ప్రాఫిట్ సినిమా అని చెప్పుకొచ్చాడు నాని.
తెలుగు సినిమాల్లో ఫైట్స్ - రోమాన్స్ - సెక్స్ - వాయిలెన్స్ ఇలా కొన్ని సెల్లింగ్ ఎలెమెంట్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఒక సినిమా తీసి దాని ద్వారా వరల్డ్ వైడ్ గా ముప్పై కోట్ల థియేట్రికల్ రైట్స్ రాబడితే ఆ సినిమాను అందరూ మెచ్చుకొని అన్ని భాషల్లో రీమేక్ చేస్తుంటే ఏంటో అనుకున్నంత ఆడలేదంటారేంటి..? అనేది నాని వాదన. అంతే కాదు ఇంక నన్నేం చేయమంటారు మీరు చెప్పండి అంటూ తన భాధను చెప్పుకున్నాడు నాని.