గత కొన్నేళ్లలో తెలుగు సినిమా చాలా మారింది. రొటీన్ సినిమాలు వర్కవుట్ కావట్లేదిప్పుడు. ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలకు సరైన ఫలితాలు రావట్లేదు. ప్రేక్షకులు ఏదో ఒక కొత్తదనం ఆశిస్తున్నారు. దీంతో స్టార్లు సైతం కొత్త తరహా కథల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంచెం రొటీన్ కథలతోనూ సక్సెస్ సాధిస్తున్నాడు నాని. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘నేను లోకల్’ సినిమా మామూలుగానే అనిపిస్తుంది. అయినా అది బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నాని నుంచి వస్తున్న‘ఎంసీఏ’ టీజర్.. ట్రైలర్ చూసినా అదేమంత కొత్త తరహా సినిమాలా అనిపించలేదు. ఇది ‘రేసుగుర్రం’ ఫార్మాట్లో సాగే కథలా అనిపించింది. ఇంకా కొన్ని సినిమాల ఛాయలు కనిపించాయి.
మరి ఇదే విషయమై నాని దగ్గర ప్రస్తావిస్తే.. ‘ఎంసీఏ’ కొత్త తరహా సినిమా ఏమీ కాదని తేల్చేశాడు. ఇలాంటి సినిమాలు గతంలో వచ్చాయన్నాడు. ఐతే అన్ని సినిమాల నుంచి కొత్తదనం ఆశించలేమని.. ఈ తరహా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యమైన విషయమని.. అది వర్కవుటైతే సినిమా ఆడుతుందని.. లేదంటే లేదని నాని అన్నాడు. ఈ జానర్ కథలన్నీ ఒకలాగే ఉంటాయని.. ఐతే ట్రీట్మెంట్ విషయంలో కొత్తదనం చూపించాల్సి ఉంటుందని.. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కీలకమని.. ‘ఎంసీఏ’ విషయంలో తాము అదే ప్రయత్నం చేశామని నాని చెప్పాడు. మొత్తానికి రిలీజ్ తర్వాత రొటీన్ అనే విమర్శలు వస్తాయేమో అని నాని ముందే అందరినీ ప్రిపేర్ చేస్తున్నట్లుంది. రొటీన్ అనిపించినా ఎంటర్టైన్ చేస్తామని అతను హామీ ఇస్తున్నాడు. మరి ఈ రొటీన్ ఎంటర్టైన్మెంట్ ఏమేరకు వర్కవుటవుతుందో చూడాలి.