‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు నాని. అదే కోవలో తన తర్వాతి సినిమాలో నాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఐతే నాని మాత్రం తనది పవన్ కళ్యాణ్ పాత్ర కాదని.. అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించాడు. మరి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఫ్యానా అంటే మాత్రం సమాధానం చెప్పలేదు నాని.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇస్తూ.. ‘‘ప్రస్తుతానికి నేను కమిటైంది రెండు సినిమాలు మాత్రమే. మిగతావి చర్చల దశలో ఉన్నాయి. ‘‘ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ నిర్మించే ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. అందులో నేను సహాయ దర్శకుడి పాత్ర పోషిస్తున్నా. ఆ తర్వాత ‘సినమా చూపిస్త మావ’ తీసిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే చిత్రం చేస్తా’’ అన్నాడు నాని.
ఇక శుక్రవారం విడుదల కాబోయే తన కొత్త సినిమా ‘జెంటిల్ మన్’ గురించి చెబుతూ.. ‘‘ఇది కొత్తదనానికి కొత్తదనంతో పాటు కమర్షియల్ విలువలూ ఉన్న సినిమా. కథే అన్నిటికంటే పెద్ద హైలైట్. వదులుకుంటే మళ్లీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదనిపించి చేశా. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా అని చాలా చర్చించుకున్నాం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారే ‘జెంటిల్ మన్’ పేరు సూచించారు. ఐతే తెలుగులో టైటిల్ పెడదామని.. దీనికి సరిపడే తెలుగు పదం కోసం నా కోస్టార్ అవసరాల శ్రీనివాస్ ను అడిగితే.. అతను ‘జెంటిల్ మన్’ అన్న పేరే బాగుంటుందన్నాడు. సినిమా చూశాక ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు’’ అని నాని చెప్పాడు.