ట్రెండ్ ఫాలో అవుతున్న నాని

Update: 2017-01-05 05:30 GMT
సినిమా ప్రచారం రకరకాల మలుపులు తీసుకుంటోందనే మాట వాస్తవమే. రిలీజ్ కి దగ్గర పడ్డ సినిమాకి భారీ ఆడియో ఫంక్షన్ నిర్వహించి.. అందులో పాటలను.. థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేయడం.. కొన్నేళ్లుగా సాగుతున్న ఆనవాయితీ. దీనికి ఈ మధ్య కాలంలో బ్రేక్ పడింది. గీతాఆర్ట్స్ ఈ విషయంలో ట్రెండ్ బ్రేక్ చేసి.. డైరెక్టుగా పాటలను మార్కెట్లో రిలీజ్ చేసేయడం మొదలుపెట్టారు. సరైనోడు.. ధృవ.. ఖైదీ నంబర్ 150 మూవీస్ విషయంలో ఇదే జరిగింది.

వీటితో పాటు సినిమాలోని కీలకమైన పాటను ముందే లిరికల్ ఆడియో అనో.. సాంగ్ ప్రోమో అనో.. ఏదో ఒక పేరుతో పాటలను లాంఛ్ చేస్తుండడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోతోంది. దీన్ని నాని కూడా ఫాలో అయిపోబోతున్నాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నటించిన మూవీ నాని లోకల్ చిత్రానికి ఆడియోను ఒక్కో పాట చొప్పున మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. 'నెక్ట్స్ ఏంటి' అంటూ సాగే పాటను డైరెక్టుగా విడుదల చేస్తామని.. జనవరి 6.. అంటే రేపటి నుంచే ఈ పాట శ్రోతలకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు నిర్మాతలు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా.. త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News