ఆగిన నేచురల్ స్టార్ పాన్ ఇండియా మూవీ..

Update: 2020-04-27 11:10 GMT
టాలీవుడ్ నాచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కథ సినిమాని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి 'నాని' హీరోగా చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'టాక్సీ వాలా' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి 'శ్యామ్ సింగ రాయ్'  అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర కథానాయకుడు నాచురల్ స్టార్ 'నాని' పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్ర బృందం. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. హీరో 'నాని' కి ఇది 27వ చిత్రం. అయితే ఈ చిత్రం ప్రారంభం, చిత్రానికి సంబంధించిన ఇతర సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

ఇక రాహుల్ కథ ఫైనల్ చేసిన తర్వాత శ్యామ్ సింగరాయ్ టైటిల్ సెట్ చేయడంతో సినిమాపై స్పెషల్ బజ్ మొదలైంది. ఈ సినిమా పిరియడిక్ కాన్సెప్ట్ తో రూపొందనుంది కాబట్టి అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. నిర్మాతలు కూడా హై బడ్జెట్ లో సినిమాను ప్లాన్ చేసి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయాలని అనుకున్నారట. నాని కూడా పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ పక్కన పడేశారని సమాచారం. లాక్ డౌన్ తరువాత కూడా సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదట.కరోనా పూర్తిగా అంతమయ్యే వరకు కనీసం ఓ ఏడాది పట్టేలా ఉంది. అప్పటి వరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావు. ఒకవేళ వచ్చినా జనాలు ఎంతవరకు పట్టుంచుకునేలా లేరు. అందుకే నిర్మాతలు రిస్క్ చేయడానికి సిద్ధం లేరట. ఈ దెబ్బతో నాని పాన్ ఇండియా స్టార్ అయ్యే యోచన మానుకుంటే మంచిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
Tags:    

Similar News