వరస హిట్లతో మంచి జోరుమీదున్నాడు నాచురల్ స్టార్ నాని. తన లేటెస్ట్ సినిమా ఎంసీఏ కథ.. కథనాలు రొటీన్ గానే ఉన్నా నానికి ఆడియన్స్ లో ఉన్న ఆదరణ కారణంగా ఆ సినిమాకు పుష్కలంగా కలెక్షన్లు వచ్చాయి. యంగ్ హీరోల్లో త్వరగా స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు.
ఇతరులకు భిన్నంగా వరస విజయాలు ఎలా సొంతం అవుతున్నాయన్న ప్రశ్నకు నాని డిఫరెంట్ గానే స్పందించాడు. విజయాన్ని తలకు ఎక్కించుకోక పోవడం వల్లనే విజయం వరిస్తోందని అంటున్నాడు. ‘‘ఈ రోజుల్లో వినోదం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకులా సినిమా ఒక్కటే ఆప్షన్ కాదు. ఎంతటి యాక్టరైనా సినిమా రిలీజయ్యే శుక్రవారం నాడు తన టాలెంట్ ను ఎప్పటికప్పుడు ప్ర్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన దిశగా లక్ష్యం నిర్దేశించుకుని జీవితంగా ముందుకు సాగిపోవాలి’అంటూ తనదైన స్టయిల్లో నెరేట్ చేసుకుంటూ వచ్చాడు.
‘‘నన్ను అబ్బురంగా చూసే అభిమానులను చూసినప్పుడల్లా నా బాధ్యత మరింత పెరిగిందనే భావస్తాను. నాకొచ్చే కాంప్లిమెంట్లను ఎంజాయ్ చేస్తానే కానీ వాటిని చూసి గర్వపడిపోను.’’అంటూ పక్కా జెంటిల్ మేన్ ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు. తాజాగా నాని కెరీర్ లో రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తూ కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు భారీ తారాగణంతో అ! సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.