తన సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షనైనా.. ప్రి రిలీజ్ ఈవెంటైనా చాలా ఆసక్తికరంగా మాట్లాడతాడు నాని. తిరుపతిలో జరిగిన తన కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ నాని తనదైన శైలిలో మాట్లాడి అక్కడి జనాల్ని అలరించాడు. నాని మాట్లాడటానికి ముందు అతడి గురించి వేసిన ఏవీలో ‘తిరుపతి కుర్రాడు కాకపోయినా తిరుపతి కుర్రాడిలా చాలా బాగా నటించాడు’ అన్నారు. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘ఆ మాట తప్పు. ఎవరన్నారు నేను తిరుపతి కుర్రాడు కాదని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాతయ్య వాళ్ల ఊరి కంటే తిరుపతికే ఎక్కువసార్లు వచ్చాను. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తిరుపతికి వచ్చి ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాల్సిందే. లేదంటే ఏదో మిస్సయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తీ తిరుపతికి చెందిన వాడే’’ అన్నాడు.
ఇక ‘కృష్ణార్జున యుద్ధం’ దర్శకుడు గాంధీ గురించి నాని మాట్లాడుతూ.. ‘‘గాంధీ నన్ను పూర్తిగా చెడగొట్టేశాడు. అతను ప్రతి రోజూ షూటింగులో ప్రతి విషయం నన్ను అడిగి చేసేవాడు. అలా ఇంత వరకు ఏ దర్శకుడూ నాతో వ్యవహరించలేదు. ఒక దర్శకుడిలాగా కాకుండా తమ్ముడిలాగా ఉన్నాడు. ఇది నాకు చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఇలా అలవాటు పడితే చాలా కష్టం. తర్వాతి సినిమాకు నేను మళ్లీ కొత్తగా అలవాటు పడాల్సి ఉంటుంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాకు ఎంజాయ్ చేసినంతగా మరే సినిమాకూ ఎంజాయ్ చేయలేదు’’ అని చెప్పాడు.