మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన నాని

Update: 2018-08-06 10:37 GMT
ఫ్రెండ్ షిప్ డే.. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో మధుర సృతులను తట్టిలేపింది. ముఖ్యంగా హోస్ట్ నాని తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకొని ఎమోషన్ అయ్యాడు. ఫ్రెండ్ షిప్ కు ఉన్న విలువను ఓ యాక్సిడెంట్ తట్టి లేపిందని గుర్తుచేసుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం హోస్ట్  నాని ఫ్రెండ్ షిప్ గురించి వివరిస్తూ ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.. ‘అప్పుడే నేను హీరోగా ఎంట్రీ ఇచ్చాను... రెండో సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ లతో అస్సలు తీరిక ఉండేది కాదు. ఓ రోజు వీలు చూసుకొని స్నేహితులతో సరదాగా గడపాలని హైదరాబాద్ నుంచి అంతర్వేదికి కారులో బయలు దేరాం.. నేనూ నాతోపాటు నలుగురు స్నేహితులు వెళ్తున్నాం.. ముందు సీట్లో నా ఫ్రెండ్ ప్రశాంత్ - డైవర్ సీట్లో నేనూ కూర్చున్నా.. అర్ధరాత్రి దాటాక.. మధ్యలో రోడ్డుపై నిలిచిపోయిన ఓ పాత లారీ అడ్డంగా ఉంది. మూలమలుపు వద్ద ఉండడంతో లారీ కనిపించలేదు. అదుపు చేయలేక లారీని ఢీకొట్టాను. అద్దాలు పగిలి చేతులు - ముఖానికి గాయాలయ్యాయి. నా గదవ కింద కట్ అయిపోయి రక్తం ధారళంగా కారుతోంది. పొగ - మైకం దుమ్ము ఏం జరిగిందో అర్థం కాలేదు.. కారు డోరు తీసి బయటకు వచ్చాను. పక్కనే ఉన్న ప్రశాంత్ కదలకుండా పడిపోవడం చూసి ఫ్రెండ్స్ అంతా ప్రశాంత్ అంటూ అరుస్తున్నారు. నేను సృహలో ఉన్నానో లేదో తెలియని స్థితిలో ప్రశాంత్ ను డోరు తీసి కిందకు దించి గట్టిగా ఊపాను.. వాడికి మెలకువచ్చింది.  నేను మాత్రం సృహ తప్పి పడిపోయాను. ’ అంటూ నాని తన యాక్సిడెంట్ ను వివరించాడు.

నా చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత్ ను బతికించాలన్న నా తపనే నన్ను ఏదో శక్తి ఆవహించినట్టు వాడి వద్దకు తీసుకెళ్లిందని నాని వివరించాడు. సైన్స్ - లాజిక్స్ లకు అతీతంగా ఫ్రెండ్ షిప్ ఉందనడానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటనే గొప్ప ఉదాహరణ అని నాని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నా ఫ్రెండ్స్ తో జరిగిన ఈ సంఘటన గుర్తుచేసుకోవాలనిపించిదని నాని చెప్పి అందరినీ ఎమోషన్ కు గురిచేశాడు..
Tags:    

Similar News