న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న నటులు ఎవరైనా ఉన్నారా అంటే నాని పేరు తప్పకుండా వినిపిస్తుంది. సహాయ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రైండ్ లేకపోయినా టాలీవుడ్ లో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. నాని గత కొన్నేళ్ల నుంచీ సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు.
'శ్యామ్ సింగ రాయ్' మినహా.. ఈ మధ్య కాలంలో ఈయన నుంచి వచ్చిన 'టక్ జగదీష్', 'వి', 'నాని గ్యాంగ్ లీడర్’, 'దేవదాస్', 'కృష్ణార్జున యుద్ధం' ఇలా అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక నాని తాజాగా 'అంటే.. సుందరానికీ'తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించింది. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్, నరేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూన్ 10న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ను రాబడుతూ ఫ్లాప్ దిశగా దూసుకెళ్తోంది. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మొదటి వారం అతి కష్టం మీద రూ. 18 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టింది. ఇక రెండో వారం బాక్సాఫీస్ వద్ద మరింత డల్ అయిపోగా.. పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
అయితే నాని వరుస ఫ్లాపులను మూటగట్టుకోవడం వెనక ఓ కారణం బలంగా వినిపిస్తోంది. నాని టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తున్నా.. తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవడంలో ఫెయిలవుతున్నాడని.. ఆ పొరపాటే ఆయన కెరీర్ ను దెబ్బ తీస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నాని సినిమాలను ఎంపిక చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని అంటున్నారు. మరి ఇప్పటికైనా కథల ఎంపికలో నాని జాగ్రత్త పడతాడా.. లేదా.. అన్నది చూడాలి.
కాగా, ప్రస్తుతం ఈయన 'దసరా' అనే మూవీ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అలాగే ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాని తెలంగాణ కుర్రాడిగా మాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు.