శ్రీరెడ్డిపై నాని యుద్ధం మొదలైంది

Update: 2018-06-11 14:10 GMT
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నెలలుగా సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది శ్రీరెడ్డి.  పలువురు ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. కొన్ని రోజులుగా నేచురల్ స్టార్ నానిని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కొందరి విషయంలో మాదిరి డొంక తిరుగుడు లేకుండా నేరుగా నాని పేరు పెట్టి ఆమె ఆరోపణలు చేయడం విశేషం. రోజు రోజుకూ నాని మీద ఆమె ఆరోపణల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఐతే ఇన్నాళ్లూ ఓపిక పట్టిన నాని.. ఇక లాభం లేదని రంగంలోకి దిగేశాడు. శ్రీరెడ్డి మీద న్యాయ పోరాటానికి అతను సిద్ధమయ్యాడు.

సోమవారం శ్రీరెడ్డికి నాని లాయర్ లీగల్ నోటీసు పంపాడు. సహనానికి కూడా ఒక హద్దుంటుందని.. అందుకే తానిలా లీగల్ నోటీసు పంపాల్సి వస్తోందని నాని పేర్కొన్నాడు. తనపై ఆరోపణలపై స్పందించడం ద్వారా అవతలి వ్యక్తి కోరుకున్నది ఇవ్వాలనుకోవట్లేదని నాని పేర్కొనడం విశేషం. తోచిన వాళ్ల పేర్లు ఎంచుకుని.. సాఫ్ట్ టార్గెట్లుగా అనిపించే వాళ్లను అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని.. అవతలి వాళ్లకిది తేలిగ్గా అనిపించినా.. తనను మాత్రం ఇలాంటివి డిస్టర్బ్ చేస్తాయని.. తన కంటే కూడా తన చుట్టూ ఉన్నవాళ్లకు ఇది బాధ కలిగిస్తుందని నాని అన్నాడు. ‘‘కొంచెం సిగ్గుపడండి. మీకు కూడా కుటుంబాలుంటాయి’’ అని నాని పేర్కొనడం విశేషం. మరి నాని లీగల్ నోటీసుకు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News