నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన 'శ్యామ్ సింగ రాయ్' .. ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. "రచయిత సత్యదేవ్ గారు 'శ్యామ్ సింగ రాయ్' గురించి ఒక కథగా రాహుల్ కి చెప్పారు. అప్పుడు రాహుల్ ఆ కథకి పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఆయన ఆ స్క్రిప్ట్ చెబుతూ ఉంటే, ఆ తరువాత ఏం జరగబోతోంది అనే ఆసక్తి నాలో పెరుగుతూ పోయింది.
అప్పుడే అనుకున్నాను .. ఈ సినిమా తప్పకుండా చేయాలని. రాహుల్ 'శ్యామ్ సింగ రాయ్' పాత్రను గురించి చెబుతున్నప్పుడే ఆ పాత్ర ఎలా ఉండాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సినిమా కోసం ఒక ఐదారు లుక్స్ అనుకుని చివరికి ఇప్పుడు తెరపై కనిపిస్తున్న లుక్ ను ఓకే చేశారు. ఏఎస్ ఇనిమ కోసం ముందుగా వాసు పాత్రకి సంబంధించిన షెడ్యూల్ ను పూర్తిచేశాను. ఆ పాత్రకి సంబంధించిన షూటింగు పూర్తికాగానే, నేను కారవాన్ లోకి వెళ్లి పూర్తిగా గెడ్డం తీసేసి 'శ్యామ్ సింగ రాయ్' లుక్ తో బయటికి వచ్చాను.
సెట్లో ఎవరూ కూడా నన్ను గుర్తుపట్టలేదు. చివరికి మా మేనేజర్ కూడా నన్ను చూసి పక్కనుంచి వెళ్లిపోతున్నాడు. అప్పుడు నేను ఆయనను పలకరిస్తే .. "సార్ .. మీరా .. నేను అసలు గుర్తుపట్టనే లేదు. ఈ పాత్రకి మీరు పెర్ఫెక్ట్ గా సరిపోయారు సార్ " అన్నాడు. అప్పుడు నాపై నాకు ఒక బలమైన నమ్మకం వచ్చింది. నేను కొత్తగానే కనిపిస్తున్నాను అనే ఒక ధైర్యం వచ్చింది. వెంటనే ఒక ఫొటో తీసేసుకుని మా అక్కయ్యకి పంపిస్తే .. తాను కూడా నా మనసులోని మాటనే చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
ఇక మైథిలి పాత్రకి సాయిపల్లవి అయితే బాగుంటుందని అనుకున్నాము. 'ఎంసిఎ' సినిమా తరువాత నుంచి ఆమె మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది. ఈ సినిమాలో మైథిలి ఒక బెంగాలీ అమ్మాయి .. డాన్స్ ప్రాధాన్యత కలిగిన పాత్ర. అందువలన ఈ పాత్రను చేయడానికి ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందనే అనుకున్నాను. సాయిపల్లవితో మాట్లాడిన తరువాత రాహుల్ నాకు కాల్ చేసి ఆమె ఒప్పుకున్నట్టుగా చెప్పాడు. నేను ఊహించిందే కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇక ఈ సినిమాలో కీర్తి పాత్రకి అందంగా .. అమాయకంగా కనిపించే కొత్త అమ్మాయి అయితే బాగుంటుదని అంతా అనుకున్నాము.
అదే సమయంలో 'ఉప్పెన' పోస్టర్లు బయటికి వచ్చాయి. 'ఉప్పెన' పోస్టర్లలో కృతి చాలా అందంగా .. అమాయకంగా కనిపించింది. అందువలన ఆమెను తీసుకోవడం జరిగింది. రెండవ సినిమానే అయినా పాత్రను అర్థం చేసుకుని చాలా బాగా చేసింది. ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ బయటికి వచ్చిన తరువాత మా నమ్మకం పెరిగిందే తప్ప తగ్గలేదు. కథాకథనాలు .. మాటలు .. పాటలు .. లుక్స్ .. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ ఇలా అన్నీ కుదురుతూ వచ్చాయి.
ఇక ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు, జనాలు థియేటర్లకు వస్తారా? అనే సందేహం తలెత్తింది. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'లవ్ స్టోరీ' .. రీసెంట్ గా వచ్చిన 'అఖండ' మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు దేనినీ లెక్కచేయరనే విషయం అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చాడు.