డాడీగా నాని ప్రేమ ఇది!!

Update: 2018-09-26 07:40 GMT
రేపు విడుదల కాబోతున్న దేవదాస్ మీద న్యాచురల్ స్టార్ నానికే కాదు అతని అభిమానులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ స్టేటస్ వచ్చాక నాని ఇప్పటిదాకా అన్ని సోలోగానే చేస్తున్నాడు. చిన్నా చితకా హీరోలతో తప్ప సీనియర్లతో నటించే అవకాశం రాలేదు. అందుకే దేవదాస్ ని చాలా స్పెషల్ గా ఫీలవుతున్నాడు. ఒకపక్క బిగ్ బాస్ 2 తాలూకు వ్యవహారాలు చూసుకుంటూనే మరోపక్క నాన్ స్టాప్ గా జరుగుతున్న దేవదాస్ ప్రమోషన్ కోసం తన శాయశక్తులా అందుబాటులో ఉంటూ ఏది మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. అలాంటిది ఇంత టైట్ షెడ్యూల్ లో ఇంకో సమస్య అది కూడా కుటుంబానికి సంబంధించినది చుట్టుముడితే ఎలా ఉంటుంది. నానికి అదే జరిగిందని టాక్.

నాని గారాల బాబు అర్జున్ ఘంటా నిన్న  రాత్రి అనుకోకుండా స్వల్ప అస్వస్ధతకు గురైనట్టు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రికి వెళ్లిన నాని ఇవాళ ఉదయం ఉన్న ప్రమోషనల్ ఇంటర్వ్యూకి రాలేని నిస్సహాయతను టీమ్ కు  చెప్పడం ఒత్తిడిలో మర్చిపోయాడు. కానీ అక్కడ ముందే ఏర్పాట్లు జరిగాయి కాబట్టి హీరోల్లో ఒకడైన తను అక్కడ ఉండకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో మనసు కష్టపెట్టుకుని వచ్చినట్టు తెలిసింది. ఈ సంఘటన విని నాని ఫాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు కూడా చలించిపోతున్నారు.

ఎంత  నటులైనా వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. సమస్యలు వస్తాయి. అయినా కూడా నవ్వు చెరిగిపోకుండా కెమెరా ముందు  నటిస్తూ కొన్నిసార్లు సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. తను రాకపోతే కారణం ఏదైనా మీడియాలో అనవసరంగా హై లైట్ అవ్వడమే కాక నాగ్ లాంటి సీనియర్ హీరో వచ్చినపుడు తాను లేకపోవడం నెగటివ్ గా వెళ్తుంది అనే ఉద్దేశంతో నాని ఇలా చేసినట్టు చెబుతున్నారు. నిజంగా నానిని ఈ విషయంలో మెచ్చుకోవలసిందే. కానీ అర్జున్ కు వచ్చిన భయమేమీ లేదు. కేవలం వాతావరణంలోని మార్పుల వల్ల కొంత జ్వరం వచ్చిందని  త్వరగానే కోలుకుంటాడని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. ఏదైతేనేం చిన్నదో పెద్దదో అర్జున్ అనారోగ్యం నానిని బాగా టెన్షన్ పెట్టినట్టు ఉంది. రాత్రి మొదలుకుని తెల్లవారే వరకు నాని బాబు ఉన్న బెడ్ పక్కనే ఉన్నాడట. తండ్రి ప్రేమ మరి. కంట్లో నలుసునైనా భరిస్తాం కానీ కన్నబిడ్డ కలతలను కాదుగా. అందుకే నాని నాన్నగా కూడా మనసులు గెలుచుకున్నాడు.
   

Tags:    

Similar News