నేచురల్ స్టార్ నాని తన 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్ పై నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి ''మీట్ క్యూట్'' అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాని సోదరి దీప్తి ఘంటా ఈ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'టక్ జగదీష్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని దీనిపై క్లారిటీ ఇచ్చారు.
'మీట్ క్యూట్' సినిమా ఓటీటీలోనే విడుదల అవుతుందని.. కాకపోతే స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదనేది ఇంకా కంఫర్మ్ అవలేదని నాని చెప్పుకొచ్చారు. ఆంథాలజీ మూవీస్ కి ఓటీటీలు సరైన వేదికలని చెప్పవచ్చు. 'వి' 'టక్ జగదీష్' సినిమాలతో నాని ఓటీటీ బ్రాండ్ వాల్యూ పెరగడం.. 'మీట్ క్యూట్' హక్కులు మంచి రేటుకు అమ్ముడవడానికి హెల్ప్ అవ్వొచ్చు. నాని ఈ ఇంటర్వ్యూలో లో తన అక్క దీప్తి గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన తనకెప్పుడూ లేదని.. రైటింగ్ అంటే తనకి చాలా ఇష్టమని తెలిపారు.
''అక్క ఓరోజు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా.. ఏం చేయాలి అని అడిగింది. ఆన్ లైన్ లో హాలీవుడ్ స్క్రిప్ట్స్ చూడు ఓ అవగాహన వస్తుందని సలహా ఇచ్చా. అలా వాటిని చూసి స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుని ఓ ఆంథాలజీ రాసింది. ఎలా ఉందో చెప్పమని నాకు పంపింది. కానీ, నేను అక్కని తక్కువ అంచనా వేసి ఆ స్క్రిప్ట్ ని పట్టించుకోలేదు. ఓరోజు మా కజిన్స్ దీప్తీ స్క్రిప్ట్ బాగా రాసిందని చెప్పడంతో.. అంతగా ఏం రాసిందోనని చదివా. చాలా అందంగా ఓ గొప్ప కథలా అనిపించింది'' అని నాని చెప్పారు.
''ఈ స్క్రిప్ట్ నీకేమన్నా పనికొస్తే వాడుకోమని అక్క అన్నది. ఇంత మంచి కథని.. నువ్వే తెరకెక్కించాలని చెప్పా. నాకేమీ తెలియదు.. నేను చేయలేను అంది. మంచి టీమ్ ని ఇస్తా.. నువ్వు ఏం రాశావో అది వాళ్లకి చెప్పు చాలు.. ఓ వారంలో నీకు అంతా అర్థమైపోతుందని చెప్పా. అలా ‘మీట్ క్యూట్’ ని స్టార్ట్ చేశాం. ఈ సినిమా తర్వాత తనకి చాలా ఆఫర్స్ వస్తాయి'' అని నాని అన్నారు. కాగా, మహిళా ప్రధానంగా సాగే ఈ ఆంథాలజీలో ఐదు కథలను చెప్పబోతున్నారు. ఇందులో ఆరుగురు మేల్ - ఆరుగురు ఫీమేల్ లీడ్ యాక్టర్స్ నటిస్తున్నారు.
'మీట్ క్యూట్' లో రోహిణి - అదా శర్మ - వర్ష బొల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహాని శర్మ - సునయన - సంచిత పూనచ మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య మరియు రాజా మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తుండగా.. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.