నాని జడ్జిమెంట్ పై అవసరాల సెటైర్!

Update: 2016-08-22 10:16 GMT
"జ్యో అచ్యుతానంద" సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా జరిగింది. ఈ వేదికపై కుర్ర హీరోలు చాలా కబుర్లే చెప్పారు. వీరిలో హీరో నాని తనదైన శైలిలో టీం కి విషెస్ చెప్పాడు. సదారణంగా ఆడియో ఫంక్షన్ అంటే.. ఆల్ ది బెస్ట్ చెబుతారు కానీ... ఈ సీమా టీం కి నాని మాత్రం "కంగ్రాచ్యులేషన్స్" చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన నానీ.. ఈ సినిమా ఫలితం మీద తనకు చాలా నమ్మకం ఉందని, సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ అని తనకు ముందే తలుసు కాబట్టే తాను కంగ్రాట్స్ చెబుతున్నానని అన్నాడు.

అనంతరం.. అవసరాల శ్రీనివాస్ పై స్పందించిన నానీ.. అతని సెన్సాఫ్ హ్యూమర్ టూమచ్ గా ఉంటుందని, అతనంత సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు ఈంకొకరు ఉండకపోవచ్చని చెప్పాడు. దీనికి ఉదాహరణగా... "జెంటిల్మన్ సినిమా షూటింగ్ సమయంలో నేను - శ్రీను కార్లో వెళ్తున్న సీన్ షూట్ చేయాల్సి వచ్చింది.. కారుకు ఒకవైపు కెమెరా ఫిక్స్ చేసి ఉంది, అయితే ఆ కెమెరాకు ఏమాత్రం దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి" అని కెమెరామెన్ చూసించాడు.. ఆ సమయంలో స్పందించిన నాని... "ఏం భయం లేదు.. నా జడ్జిమెంట్ స్కిల్స్ చాలా బాగుంటాయి" అని కెమెరామెన్ తో చాలా కాన్ఫిడెంటుగా అన్నాడట. వెంటనే స్పందించిన అవసరాల  "పైసా తప్ప" అనేసి సైలెంటుగా ఉన్నాడట. ఈ విషయం అర్ధంచేసుకోవడానికి తనకు రెండు నిమిషాలు పట్టిందని, తర్వాత నవ్వు ఆపుకోవడానికి ఇంకాస్త సమయం పట్టిందని నాని చెప్పాడు. అనంతరం "పైసా" తనకు బాగా నచ్చిన సినిమా అని చెప్పుకొచ్చాడు నాని. "నా జడ్జిమెంట్"పై అవసరాల అలాంటి సెటైర్స్ వేస్తాడని నానీ చెప్పాడు.

"జ్యో అచ్యుతానంద" కథ నాకు ముందే తెలుసు, అవసరాల నాకు ఎప్పుడో నరేట్ చేశాడు. అప్పుడే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో నాకు అర్థమైపోయింది. అందుకే ఈ టీంకు ముందే కంగ్రాట్స్ చెబుతున్నా" అని ముగించాడు నాని.
Tags:    

Similar News