బిగ్ బాస్ కు హోస్టింగ్ చేసేవారు ఎవరైనా ఇంటి సభ్యులు తప్పుగా ప్రవర్తిస్తే వారిని మందలించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ హోస్ట్ అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సల్మాన్ ఖాన్. సుదీర్ఘ కాలం పాటు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఇంటి సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటం గతంలో పలు సార్లు చూశాం. టీం సభ్యులతో కూడా చర్చించకుండా సల్మాన్ ఖాన్ వివాదంకు కారణం అయిన ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటి సభ్యుడిని కూడా సమానంగా హోస్ట్ చూడాల్సి ఉంటుంది. కాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2కు హోస్టింగ్ చేస్తున్న నాని అలా చేయలేక పోతున్నాడు అంటూ మొదటి నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండవ సీజన్ కు ఆయన అందుబాటులో లేకపోవడంతో నానిని ఎంపిక చేయడం జరిగింది. నాని మొదటి నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొందరిపై ఫేవరేట్ యిజం చూపిస్తున్నాడు అంటూ నానిని కొందరు సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో నాని జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కౌశల్‌కు మద్దతుగా ఏర్పాటు అయిన కౌశల్ ఆర్మీ సభ్యులు నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆమద్య కౌశల్ ను టార్గెట్ చేసి నాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాని బిగ్ బాస్ షోకు హోస్ట్ గా అన్ ఫిట్ అంటూ హ్యాస్ ట్యాగ్ తో పోస్ట్ లు చేశారు. ఆ హ్యాష్ ట్యాగ్ ఏకంగా ట్రెండ్ అయ్యింది అంటే కౌశల్ ఆర్మీ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకోవచ్చు.
కౌశల్ ఆర్మీతో పెట్టుకోవద్దని నిర్ణయించుకున్న నాని నిన్నటి ఎపిసోడ్ లో పూర్తిగా కౌశల్ కు మద్దతుగా మాట్లాడాడు. కౌశల్ మరియు తనీష్ ల గొడవలో కాస్త కౌశల్ తప్పు ఉన్నా కూడా పూర్తిగా తనీష్ ను టార్గెట్ చేసి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు తప్ప - కౌశల్ వైపు వేలు ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. కౌశల్‌ను చిన్న మాట అన్నా కూడా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారు అనే ఉద్దేశ్యంతో నాని భయపడుతున్నాడు. కౌశల్ ను పూర్తిగా వదిలేయాలని నాని నిర్ణయించుకున్నాడు. కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి ఉందని ఇంటి సభ్యులకు తెలిసిన నేపథ్యంలో ఇప్పటి నుండి కౌశల్ తో వారు జాగ్రత్తగా ఉంటారేమో చూడాలి.