టైటిల్ లోనే సగం విక్టరీ దాగి ఉందని అంటారు. అలాంటి టైటిల్ ఎంపిక విషయంలో మన దర్శకనిర్మాతలు- హీరోలు చాలానే తర్జనభర్జన పడుతుంటారు. నిర్మాతలతో ఘర్షణ పడి అయినా తాము అనుకున్న టైటిల్ నే కావాలనుకునే దర్శకులు ఎందరో. అయితే అలాంటిదేం లేదు కానీ.. ఈసారి నాని- సుధీర్ బాబు మల్టీస్టారర్ కోసం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఎంచుకునే టైటిల్ ఏమై ఉంటుంది? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే వ్యూహం అనే టైటిల్ ప్రముఖంగా వినిపించింది కానీ అది కన్ఫామ్ కాలేదని వార్తలొచ్చాయి. అలాగే ఈ సినిమా ఈపాటికే ప్రారంభించాల్సింది. జనవరి 26న ముహూర్తం చేస్తారని ప్రచారమైంది. కానీ దిల్ రాజు కాంపౌండ్ లో ఎందుకనో ఈనెల 29కి వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. బహుశా అవెంజర్స్ హడావుడిలోనే చాలా వాయిదాలు వేసుకుంటున్నారు! అన్న ప్రచారం ఉంది. ఇకపోతే టెక్నికల్ గా ఈ సినిమాకి సంబంధించిన ఏవైనా ఇష్యూస్ వలన వాయిదా వేసారా? అన్నది తెలియాల్సి ఉంది.
అన్నట్టు ఇప్పటికైనా ఈ మల్టీస్టారర్ టైటిల్ ఏది అన్నది తేలిందా? అంటే ఎట్టకేలకు టైటిల్ ఫిక్స్ చేసేశారనే తెలుస్తోంది. `వి` అంటే వెరైటీగా ఉంటుందనో ఏమో ఇంద్రగంటి ఈ టైటిల్ కే ఫిక్సయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఊహించనిది. ఒకే అక్షరంతో టైటిల్స్ అన్నది టాలీవుడ్ లో చాలా అరుదు. అప్పట్లో ఉపేంద్ర `ఎ` అంటూ ప్రయోగం చేశాడు. అసలు టైటిల్ లేని సినిమాని కూడా రిలీజ్ చేసి ట్రెండ్ సృష్టించాడు. కానీ ఈసారి నాని-సుధీర్ బాబు- ఇంద్రగంటి బృందం చాలా వెరైటీగానే ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది. వి అంటే వెరైటీనా.. ? లేక విక్టరీనా? అన్నది కూడా చూడాలి. ఇక దీనికి ఇచ్చే ట్యాగ్ లైన్ ని బట్టి కూడా ఆ టైటిల్ పరమార్థం ఏంటో చెప్పొచ్చు. నాని విలన్ - సుధీర్ హీరో కాబట్టి విక్టరీ కోసం ఇద్దరూ ఫైట్ చేసే కథాంశమా? అన్న సందేహం కలగక మానదు.
అయితే అన్నిటికీ 29 ఏప్రిల్ సమాధానం దొరుకుతుందనే భావిస్తున్నారు. `అ` అనే టైటిల్ తో నిర్మాతగా ప్రయోగం చేసిన నానీకి వచ్చిన ఐడియానా? లేక ఇంద్రగంటి కానీ.. దిల్ రాజు కానీ సూచించినదా? అన్నది తెలియాల్సి ఉంది. అష్టాచెమ్మా.. అంతకుముందు ఆ తర్వాత.. గోల్కొండ హైస్కూల్.. సమ్మోహనం.. జెంటిల్ మేన్.. ఇలా అన్నీ వెరైటీ టైటిల్స్ అలానే అర్థవంతమైనవి ఎంచుకున్నారు ఇంద్రగంటి. ఈసారి ఒకే లెటర్ తో టైటిల్ ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ టైటిల్ నే టీమ్ అధికారికంగా లాంచింగ్ రోజున ప్రకటిస్తుందేమో చూడాలి.