నాని కమర్షియల్ అవ్వడం వల్లే ఈ ఫలితాలు

Update: 2021-09-12 05:30 GMT
అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా ఎంపిక విషయంలో నాని నిర్ణయం ను అభినందించాల్సిందే. మొదటి సినిమాతోనే నటుడిగా తనను తాను నిరూపించుకునే సబ్జెక్ట్‌ ను ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా నాని ఎంపిక చేసుకున్న కథలు దర్శకులు అందరిని ఆశ్చర్యపర్చాయి. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా కొన్నాళ్ల పాటు ఆయన పేరు మారు మ్రోగింది. నాని ఎంపిక చేసుకున్న ఎన్నో విలక్షణ కథలు మరియు దర్శకులు ఆయనకు కెరీర్‌ బెస్ట్‌ సినిమాలను అందించాయి. ఎప్పుడైతే నాని కమర్షియల్‌ బాట పట్టాడో అప్పటి నుండి ఆయన ప్లాప్ లతో సహవాసం చేయాల్సి వస్తుంది. ఆయన కమర్షియల్‌ గా ఒకటి రెండు సక్సెస్ అయితే మూడు నాలుగు ప్లాప్ అవుతున్నాయి. ఆయన ఇప్పటి వరకు 26వ సినిమాలు చేయగా చివరి నాలుగు అయిదు సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవని.. నాచురల్‌ స్టార్‌ సెలక్షన్‌ మరీ పూర్‌ అన్నట్లుగా ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోలు కొన్ని సార్లు మొహమాటంతో లేదా కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. ఆ సినిమా ప్లాప్ అని మద్యలోనే తెలిసినా కూడా లేదా ముందే అనుకున్నా కూడా సరే అనుకుంటారు. కాని ఎవరైతే కథ ల విషయంలో ఎక్కువ శద్ర పెడతారో వారికి ఖచ్చితంగా సక్సెస్ లు వరిస్తాయి. ఈ విషయంలో నాని గతంలో ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. ఆయన ఎంపిక చేసుకున్న కథలు మరియు దర్శకులు ఆయన్ను ఎక్కడో నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం నిరాశ పర్చుతున్నాయి. కమర్షియల్‌ బాట పట్టి కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడు అంటూ అభిమానులు నాని విషయంలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా నాని టక్ జగదీష్ సినిమా విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. శివ నిర్వాన ఒక మంచి కథకుడు. ఆయన నుండి ఇంకా బెటర్ కథను ఎంపిక చేసుకుని ఉండవచ్చు అనేది మీడియా వర్గాల టాక్‌. ఈ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువయ్యే స్కోప్ ఉందని ఎంపిక చేసుకుని ఉంటాడు.. కాని లవ్‌ స్టోరీలను మాత్రమే డీల్ చేయగలిగిన దర్శకుడు శివ నిర్వాన ఈ సినిమా ను చేయడంలో విఫలం అయ్యారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా నాని కెరీర్ లో మరో పోయిన మూవీగా నిలిచింది. ఈ సినిమా తో పాటు నాని శ్యామ్‌ సింగరాయ్ మరియు అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు. మరి ఆ రెండు సినిమాలు ఎలా ఉన్నాయో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాలి. ముందు ముందు అయినా పాత నానిని చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News