వైరల్ అవుతున్న నాని ట్వీట్.. మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్య..

Update: 2020-04-28 16:30 GMT
టాలీవుడ్ మెగాస్టార్.. చిరంజీవి రీసెంటుగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మనిషి రోజువారీ జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయిన నేపథ్యంలో చిరు కూడా అడుగుపెట్టేసాడు. టీవీలో వచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలో వార్తలు చాలా ఫాస్ట్ గా రావడంతో చాలా వరకు మనుషులు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా వాస్తవ ప్రపంచంలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలు గడుపుతున్నారు. ఇతర సెలబ్రిటీలు అయితే ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. లేట్ అయినా కూడా లేటెస్టుగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. తన చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు చిరు.

తాజాగా ఈరోజు ఓ ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తన మనవరాలు నవిష్క (శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల కూతురు)తో కలిసి సరదాగా టీవీ చూస్తుండగా నవిష్క, ఖైదీ నంబర్‌ 150 సినిమాలోని మిమ్మీ పాట కావాలని మారం చేస్తోంది. మనవరాలి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతున్న చిరు ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు సంగీతం.. సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా ఎంతగా ఆకట్టుకుంటుందో.. అంటూ కామెంట్ చేశాడు. అయితే ట్వీట్‌పై యంగ్ హీరో నాని చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. వీడియోలో నాకు ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు. మీరు ఏ చిన్నారి గురించి మాట్లాడుతున్నారు సర్‌.. అంటూ చిరు కూడా ఓ చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడని చెప్పకనే చెప్పాడు నాని. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కాజల్‌ అగర్వాల్‌, సాయి ధరమ్ తేజ్‌లు కూడా ఈ వీడియోపై తమదైన స్టైల్‌లో స్పందించారు.


Tags:    

Similar News