ఈమధ్య కాలంలో ఇండియా కూడా హాలీవుడ్ చిత్రాలకు భారీ మార్కెట్ గా ఎదిగింది. ఈమధ్య విడుదలైన మార్వెల్ వారి 'ఆవెంజర్స్ ఎండ్ గేమ్' బాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు డిస్నీ సంస్థ తెరకెక్కించే హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే డిస్నీ వారు కూడా తమ తాజా చిత్రం 'ది లయన్ కింగ్' ను ఇంగ్లీష్ లోనే కాకుండా ఇతర ముఖ్యమైన భారతీయ భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు కూడా అందులో ఒకటి.
తెలుగు ప్రేక్షకులు 'ది లయన్ కింగ్' పాత్రలతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా టాలీవుడ్ స్టార్లతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. 'ది లయన్ కింగ్' లో హీరో అయిన సింబా పాత్రకు న్యాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్తారని సమాచారం. ఈ విషయం తెలుపుతూ ఫిలిం మేకర్స్ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలకు జగపతి బాబు..బ్రహ్మానందం.. అలీ.. రవిశంకర్ లు డబ్బింగ్ చెప్తున్నారు. హిందీ వెర్షన్ లో ముఫాసా పాత్రకు షారూఖ్ ఖాన్.. సింబా పాత్రకు ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్తుండడం విశేషం.
తెలుగు వెర్షన్ లో కీలక పాత్రలకు పాపులర్ నటులు డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. జోన్ ఫావ్రో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.