విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా చిత్రం తెరకెక్కించారు యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్. ఈ సినిమా రిలీజ్ ముందే మెజారిటీ వీడియో ఆన్ లైన్ లో లీకవ్వడం సంచలనమైంది. ముందై లీకైనా ఆ ప్రభావం లేకుండా థియేటర్లలోనూ టాక్సీవాలా జనాదరణ పొందింది. టెక్నికల్ గా ఆ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారన్న ప్రశంసలు దక్కాయి. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందన్న టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ కు సెకెండ్ సినిమా చేసే అవకాశం రాలేదు. స్క్రిప్టు లు రెడీ చేసి హీరోల వెంటపడుతున్నా ఎందుకనో మెప్పించలేకపోతున్నాడు. ఎట్టకేల కు రాహుల్ వినిపించిన కథకు నేచురల్ స్టార్ నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
నానికి అతడి స్క్రిప్ట్ నచ్చింది. అయితే స్క్రీన్ ప్లే లో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దమని సూచించాడట. కథనంలో మార్పులతో పాటు రెండు మూడు వెర్షన్లు తీసుకుని మరోసారి కలవమని అన్నారట. దీనినిబట్టి రాహుల్ కి సెకెండ్ ఛాన్స్ ఉంది. ఫైనల్ స్క్రిప్టు తో మెప్పించాల్సిన బాధ్యత తనదే. ప్రస్తుతం నాని ఇంద్రగటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో వి అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే నాని 26వ సినిమాని మజిలి దర్శకుడు శివ నిర్వాణ తో చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ `టక్ జగదీశ్`. వచ్చే ఏడాది చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు.
అనంతరం రాహుల్ సినిమాకు నాని కాల్షీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇంకా పలువురు యువ దర్శకులకు నాని టచ్ లో ఉన్నట్లు సమాచారం. `అ!` దర్శకుడు ప్రశాంత్ వర్మ తో నాని సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రశాంత్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ `అ!` చిత్రం తో నాని నిర్మాత గా మారిన సంగతి తెలిసిందే. తన బ్యానర్లో డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడానికి అతడు ఆసక్తిని చూపిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ లాంటి యువదర్శకులను ఎంకరేజ్ చేస్తుండడం ఆసక్తికరం.