కేవలం ఐదు రోజుల్లో 25 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రంలలో వసూలు చేశాడు అబ్బాయి ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో మాంచి రిజల్టుతో దూసుకుపోతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఇకపోతే డిక్టేటర్ కూడా తొలిరోజునే 5.79 కోట్లు వసూలు చేసి.. మూడు రోజుల్లో షుమారు 11 కోట్ల షేర్ ను ఆంధ్ర - తెలంగాణల నుండి వసూలు చేసేశాడు. అంటే బాబాయ్ కూడా బాగానే దూసుకుపోతున్నాడు. అసలు వీరు వసూలు చేయాల్సిన టార్గెట్ ఎంతా అని చూస్తే.. బాగా పెద్దదే మరి.
కేవలం తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుంటే.. 40 కోట్ల షుమారు ధరకు నాన్నకు ప్రేమతో అమ్మేశారు. ప్రింట్ అండ్ పబ్లిసిటీ కలుపుకుంటే పంపిణీదారులకు ఇంకో 4 కోట్లు భారం పడుతుంది. అంటే 44 కోట్లు ఇక్కడి నుండే వసూలు చేయాలి. ఇక మిగిలిన రాష్ట్రాలు.. ఓవర్ సీస్ కలుపుకుంటే.. ఇంకో 12 కోట్లు అదనంగా అవుతోంది. అంటే 56 కోట్లు వసూలు చేస్తే.. సినిమా అందరినీ ఒడ్డున పడేసినట్లు. అది అబ్బాయి టార్గెట్.
ఇక డిక్టేటర్ వరకు చూసుకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 27 కోట్లకు అమ్మేశారు. ఇందులో మళ్లీ ఓ 15% డిస్కౌంట్ ఇచ్చాం అని ఈరోస్ సంస్త ప్రకటించింది కాని.. ఎక్కువ శాతం వారే డిస్ర్టిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి.. అందులో ఎవరికి ఎంత డిస్కౌంట్ వచ్చిందో యాక్చువల్ గా చెప్పలేం. సో.. బాలయ్య బాబు 27 కోట్లు వసూలు చేస్తేనే.. పంపిణీదారులు అందరూ ఎలాగైనే గట్టెక్కేది. మరి అబ్బాయ్ బాబాయ్ లు ఈ టార్గెట్లు కొట్టేస్తారా?