నాన్నకు ప్రేమతో.. ఈ ఏరియాల్లో నష్టాలే

Update: 2016-02-03 17:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ నాన్నకు ప్రేమతో. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో కూడా యాభై కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక మూవీ ఇదే.

కానీ నాన్నకు ప్రేమతో చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు. యూఎస్ లో ఈ మూవీ రైట్స్ ను 6.2 కోట్లకు విక్రయించగా దాదాపు 10 కోట్లు వచ్చాయి. అలాగే కర్నాటకో 4.50 కోట్లకు అమ్మితే 5.25 కోట్లు సాధించి లాభాలను తెచ్చిపెట్టింది. ఇండియాలో మిగిలిన ఏరియాస్ కు కోటికి విక్రయించగా.. అంతే వసూళ్లు సాధించింది. తూర్పు గోదావరిలో 3 కోట్లకు అమ్మితే.. ఇప్పటికి 2.97 కోట్లు వసూలైంది. ఇది మినహా.. చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు.

ప్రధానంగా నాన్నకు ప్రేమతో నైజాం రైట్స్ కోసం 13.50 కోట్లు వెచ్చిస్తే.. ఇప్పటికి 10.22 కోట్ల షేర్ వచ్చిందంతే. అంటే డిస్ట్రిబ్యూటర్ కి 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. సీడెడ్ లో 7.2 కోట్లకు కొనుగోలు చేస్తే 6.06 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది ఈ మూవీ. నెల్లూరు హక్కులను 1.70 కోట్లకు కొనుగోలు చేసిన వారికి 1.41 కోట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణా రైట్స్ ను 3కోట్లకు అమ్మగా 2.27 కోట్లకు వచ్చాయి. వెస్ట్ గోదావరిలో 2.52 కోట్లకు విక్రయించగా 2.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా మొత్తాన్ని నాన్నకు ప్రేమతో వసూలు చేయగా.. ఈ మూవీకి ప్రింట్స్ ప్లస్ రైట్స్ తో కలిపి 54 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం కంటే ఎక్కువగా వస్తేనే, బ్రేక్ ఈవెన్ అనాల్సి ఉంటుంది.
Tags:    

Similar News