సుకుమార్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతి రోజున సందడి చేయనుంది. నిజానికి ఈ మూవీ తమిళ్ - మళయాళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ ను కూడా ఒకేసారి రిలీజ్ చేద్దామని భావించారు కానీ.. టైం సరిపోక ఈ ప్రతిపాదనను డ్రాప్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు నాన్నకు ప్రేమతో బాలీవుడ్ లో సందడి చేయడం ఖాయమైంది.
ఎన్టీఆర్-రాజేంద్ర ప్రసాద్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాను మెయిన్ బేస్ గా చేసుకుని.. బిజినెస్ మ్యాగ్నెట్స్ మధ్య మైండ్ గేమ్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ సుకుమార్. జూనియర్ తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ - స్టైలిష్ విలన్ రోల్ లో జగపతిబాబులు నటించడం.. నాన్నకు ప్రేమతో చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని, ఇండియాలో ఏ భాషలో రిలీజ్ చేసినా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టెయిన్ మెంట్ భావిస్తోంది. అందుకే యంగ్ టైగర్ మూవీని హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు రిలయన్స్ సంస్థ నుంచి అదికారిక సమాచారమే అందుతోంది.
జనవరి నెలలో ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాను బాలీవుడ్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు రిలయన్స్ వెబ్ సైట్ లో ప్రకటించారు. గతంలోకూడా ఎన్టీఆర్ సినిమాలు డబ్బింగ్ అయినా.. ఇలా రిలీజ్ తో పాటు జరగడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి తోడు నిర్మాణ సంస్థ కూడా ప్రతిష్టాత్మకంగా భావించి రిలీజ్ చేయనుండడంతో.. ఈ మూవీ సక్సెస్ పై ఎన్టీఆర్ అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 8న సెన్సార్ చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్న నాన్నకు ప్రేమతో యూనిట్.. జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.