నాన్నకు ప్రేమతో.. టెన్షన్ టెన్షన్

Update: 2015-12-04 19:30 GMT
సరిగ్గా ఏడాది వెనక్కి వెళ్తే.. ‘టెంపర్’ సినిమా విషయంలో విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు ఎన్టీఆర్. సంక్రాంతి విడుదల అని ఘనంగా ప్రకటించేసిన ‘టెంపర్’ టీం ఆ డేటు అందుకోవడానికి రేయింబవళ్లు కష్టపడింది. కానీ ఎంత ప్రయత్నించినా సంక్రాంతి డేట్ అందుకోవడం అసాధ్యమని తేలిపోవడంతో పండగ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ విషయంలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది. ఈ మధ్య దీపావళి పోస్టర్లోనూ ‘పొంగల్ రిలీజ్’ అని ప్రకటించారు కానీ.. సినిమా మాత్రం అనుకున్నట్లుగా పూర్తి కాకపోవడంతో ‘నాన్నకు ప్రేమతో’ టీంలో టెన్షన్ మొదలవుతోంది.

స్పెయిన్ షెడ్యూల్ అనుకున్న దానికంటే ఆలస్యంగా మొదలవగా.. షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా అవ్వట్లేదని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని రావడానికి డిసెంబరు 20 దాటిపోతుందని.. ఆ తర్వాత హైదరాబాదుకొచ్చి ఆడియో రిలీజ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమే అని యూనిట్ సభ్యులు ఆందోళన పడుతున్నారు. పూరి జగన్ లాంటి స్పీడ్ డైరెక్టరే ‘టెంపర్’ విషయంలో ఎంత స్పీడ్ చూపించినా సంక్రాంతి డేటు అందుకోలేకపోయాడు. ఇక సుకుమార్ సంగతి చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే కొంచెం స్లో. ఏ విషయంలో రాజీ కూడా పడడు. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరికొచ్చేసరికి ఇంకా ఆలస్యమవడం ఖాయమని.. కాబట్టి సంక్రాంతి మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News