టెంప‌ర్ సెంటిమెంట్ సెట్‌ చేస్తారేమో

Update: 2015-12-05 07:30 GMT
ఎన్టీఆర్ హీరోగా ప్ర‌స్తుతం 'నాన్న‌కు ప్రేమ‌తో' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌కూల్ ప్రీత్‌ సింగ్ క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. ప్ర‌స్తుతం యూనిట్ స్పెయిన్ లో  షెడ్యూల్‌ ని సాగిస్తోంది. అయితే అక్క‌డ న‌త్త‌న‌డ‌క‌న షూటింగ్ సాగించ‌డం వ‌ల్ల ఈనెల 20 వ‌ర‌కూ విదేశాల్లోనే యూనిట్ గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. కార‌ణం ఏదైనా ముందే ప్ర‌క‌టించిన సంక్రాంతి డెడ్‌ లైన్‌ ని మీట‌వ్వ‌డం
క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. ఈ విషయాలు ఆల్రెడీ చెప్పుకున్నాం.

అయితే ఒకవేళ ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంటే.. అప్పుడు కొత్త రిలీజ్ తేదీ ఏదై ఉంటుంది అన్న చ‌ర్చ సాగుతోంది ఫిలింన‌గ‌ర్‌ లో.  గ‌త ఏడాది టెంప‌ర్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 13న రిలీజైంది. నాన్న‌కు ప్రేమ‌తో సంక్రాంతి రేసునుంచి త‌ప్పుకున్నాక, జ‌న‌వ‌రి ఎండ్‌ కి రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చార‌మైంది. అది కూడా కాదు ఇక రిలీజ్ ఫిబ్ర‌వ‌రిలోనే అంటున్నారు కొందరు. ఇప్పుడు అలా కాకుండా టెంప‌ర్ సెంటిమెంటుతో ఫిబ్ర‌వ‌రి 13న నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాన్ని రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని భావిస్తున్నారుట‌. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో ఇది మామూలే అయినా డెడ్‌ లైన్ ప్ర‌కారం ప‌నిచేసి సుక్కూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికైతే సంక్రాంతి రేస్ నుంచి ఔట్ అనేది క‌న్ఫ‌మ్ అనే అంటున్నారంతా.
Tags:    

Similar News