యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరీర్ లోనే 25వ సినిమాగా తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో సినిమా స్టార్టింగ్ రోజు నుంచే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టిల్స్ - లుక్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దసరాకు రిలీజ్ చేసిన నాన్నకు ప్రేమతో టీజర్ యూ ట్యూబ్ లో వీరంగం ఆడి రికార్డు స్థాయి వ్యూవ్స్ ను దక్కించుకుంది.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నాన్నకు ప్రేమతో ఆడియోను డిసెంబర్ 13న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే నాన్నకు ప్రేమతో మూవీ బిజినెస్ లోను సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నాన్నకుప్రేమతో ఇప్పటి వరకు కేవలం మూడు ఏరియాల్లో రూ.31 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం ఫ్రీ రిలీజ్ చేసిన సినిమాగా రికార్డుల కెక్కేందుకు రెడీగా ఉంది.
నాన్నకు ప్రేమతో నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ ఆయన నైజాం రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఓవర్సీస్ లో ఎన్టీఆర్ టెంపర్ రూ.6 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా రూ. 7.10 కోట్లకు అమ్ముడై ఆల్ టైం రికార్డు అందుకుంది. ఎన్టీఆర్ కు మంచి డిమాండ్ ఉన్న సీడెడ్ లో ఎన్టీఆర్ కేరీర్ లోనే హయ్యస్ట్ గా రూ 8.45 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూడు ఏరియాల టోటల్ బిజినెస్ రూ.31 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన కోస్తా ఏరియాలు - కర్ణాటక - చెన్నై బిజినెస్ తో కలుపుకుంటే రూ.60 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది.