నాన్నకు ప్రేమతో.. నిర్మాత కన్ఫమ్ చేశాడు

Update: 2015-11-22 11:30 GMT
పొంగల్ రిలీజ్ అని దీపావళి పోస్టర్ లలో వేసినా.. నిజంగానే బాబాయిని ఢీకొట్టడానికి ఎన్టీఆర్ సంక్రాంతికే వస్తాడా లేదా ఎక్కడో ఓ చిన్న సందేహం. ఒక వేళ వచ్చినా ఏ తేదీకి వస్తాడు.. నేరుగా బాబాయితో పోటీకి దిగుతాడా.. లేక కొంచెం గ్యాప్ ఇస్తాడా అన్న డౌటు. ఈ సందేహాలకు స్వయంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే తెరదించేశాడు. ‘నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ ఆయనో ప్రకటన చేశారు.

‘‘ఎన్టీఆర్ గెటప్‌ విషయంలో, క్యారెక్టరైజేషన్‌ లో.. కథ - స్క్రీన్‌ ప్లే పరంగానూ అన్ని విధాలా కొత్తగా వుండే సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో ఓ కొత్త ఎన్టీఆర్‌ ని చూపించబోతున్నాడు సుకుమార్. అదే సమయంలో ఎన్టీఆర్‌ ఇమేజికి తగినట్టుగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్లతో ఈ చిత్రం రూపుదిద్దకంటోంది. జనవరి 8నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని ప్రసాద్ చెప్పారు.

ఓవర్సీస్ లో ‘నాన్నకు ప్రేమతో’కు అదిరిపోయే బిజినెస్ ఆఫర్ వచ్చిందని.. ఈ సినిమాను అక్కడ రూ.7.1 కోట్లకు అమ్మారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాల్లో ఇదే రికార్డు ఓవర్సీస్ ప్రైజ్. అంతే కాదు.. బాహుబలి - శ్రీమంతుడు తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక రేటు పలికిన సినిమా కూడా ఇదే. నైజాం రైట్స్ కూడా అభిషేక్ పిక్చర్స్ రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News