యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ మరియు అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''18 పేజెస్''. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ స్క్రీన్ ప్లే - దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇదివరకే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ - స్పెషల్ పోస్టర్స్ మరియు గ్లిమ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా '18 పేజిస్' చిత్రం నుండి 'నన్నయ్య రాసిన' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేసారు.
'ఏ కన్నుకి ఏ స్వప్నమో.. ఏ రెప్పెలైనా తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో.. ఏ పాదమైనా చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగనా..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తనదైన శైలిలో మంచి మ్యాజికల్ మెలోడియస్ ట్యూన్ ని కంపోజ్ చేసారు.
'నన్నయ్య రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చేనుగా.. రాధమ్మ ఆపిన పాట మధురిమ.. కృష్ణుడు పాడెనుగా' అంటూ గీత రచయిత శ్రీమణి రాసిన సాహిత్యం మంచి ఫీల్ ను కలిగిస్తోంది. గాయనీ గాయకులు సితార కృష్ణ కుమార్ - పృథ్వీ చంద్ర తమ వాయిస్ తో మరింత శ్రావ్యతను జోడించారు.
'నన్నయ్య రాసిన' పాట నేపథ్యం అంతా రైటింగ్ గురించి వివరిస్తూ సాగింది. ఇందులో వేర్వేరు చోట్ల హీరో హీరోయిన్లు తమ భావాలను పంచుకుంటున్నారు. నిఖిల్ మరియు అనుపమ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ పాట వినసొంపుగా ఉండటమే కాదు.. విజువల్ గానూ బాగుంది.
ఈ పాట ఖచ్చితంగా ఇన్స్టెంట్ మెలోడీ హిట్ గా నిలుస్తుందనిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఎ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రమణ వంక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. శరణ్ రాపర్తి - అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కార్తికేయ-2' వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన సినిమా కావడంతో '18 పేజెస్' పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
''18 పేజెస్'' చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. మరి ఈ నాస్టాల్జిక్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View