చిత్రం : ‘నేను లోకల్’
నటీనటులు: నాని - కీర్తి సురేష్ - నవీన్ చంద్ర - సచిన్ ఖేడ్కర్ - పోసాని కృష్ణమురళి - ఈశ్వరి రావు - తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
రచన: ప్రసన్న కుమార్ - సాయికృష్ణ - త్రినాథరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
వరుసగా ఐదు హిట్లు కొట్టేసి ఊపు మీదున్నాడు నాని. హీరోయిన్ కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో.. నిర్మాత దిల్ రాజు ‘శతమానం భవతి’తో.. దర్శకుడు త్రినాథరావు నక్కిన ‘సినిమా చూపిస్త మావ’తో హిట్లు కొట్టిన వాళ్లే. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘నేను లోకల్’. ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాల్ని సినిమా అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
బాబు (నాని) బీటెక్ పూర్తి చేసి ఆవారాగా తిరుగుతున్న కుర్రాడు. అందరూ తర్వాతేంటి అంటూ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బాబు ఇబ్బంది పడుతున్న సమయంలో అతడికి కీర్తి (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. ఆమెను ప్రేమలోకి దింపడమే లక్ష్యంతో తను ఎంబీఏ చదివే చోటే తనూ చేరతాడు. ముందు బాబును కీర్తి అసహ్యించుకున్నప్పటికీ నెమ్మదిగా అతడి వైపు మొగ్గుతుంది. ఆమె తన ప్రేమను బాబుకు చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే సిద్ధు (నవీన్ చంద్ర) వీళ్ల మధ్యకు వస్తాడు. ఎస్సైగా పని చేసే సిద్ధుకే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కీర్తి తండ్రి. మరి కీర్తిని తన దాన్ని చేసుకోవడానికి బాబు ఏం చేశాడు.. ఆమె తండ్రిని ఎలా మెప్పించాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘‘ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలందరూ వెధవలకే పడతారు’’ అంటూ ‘నేను లోకల్’లో పోసాని కృష్ణమురళి ఒక డైలాగ్ చెబుతాడు. ‘నేను లోకల్’ ఎసెన్స్ మొత్తం ఈ డైలాగులోనే ఉంది. హీరో ఎందుకూ పనికి రాని వాడు. బాధ్యత ఉండదు. అతణ్ని చూడగానే హీరోయిన్ అసహ్యించుకుంటుంది. హీరోయిన్ తండ్రి అసహ్యించుకుంటాడు. హీరో బాధ్యతా రాహిత్యం చూసి ఓ దశలో ప్రేక్షకులకు కూడా అతడి తీరు చిరాకు పుట్టిస్తుంది. కానీ చివర్లో ఎలాగోలా హీరో అందరినీ (ప్రేక్షకుల్ని కూడా) కన్విన్స్ చేస్తాడు. సినిమా అనేదే ఒక అబద్ధం.. ఇల్లాజికల్ అంటే ‘నేను లోకల్’లో ఇంకా ఎన్నెన్నో అబద్ధాలు.. ఇల్లాజికల్ థింగ్స్ చూపిస్తారు. అయినా చివరికి వచ్చేసరికి అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఆద్యంతం వినోదాన్నందిస్తూ.. చివరికి వచ్చేసరికి అందరూ కన్విన్స్ అయ్యే వాదనతో ‘నేను లోకల్’ ఫ్రూట్ ఫుల్ గా అనిపిస్తుంది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరో హీరోయిన్ ఏదో కాలేజీలో చదువుతోందని తెలిసి అప్పటికప్పుడు తండ్రితో అప్పు తెప్పించి మరీ ఫీజు కట్టించి కాలేజీలో చేరడం.. అక్కడ హీరోయిన్ వెంట పడటమే పనిగా పెట్టుకోవడం.. కొడుకు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కోప్పడే తండ్రి ఆ అమ్మాయిని చూడగానే తనే నా కోడలు కావాలంటూ హీరోకు సపోర్టుగా నిలబడటం.. నా తండ్రిని ఇంప్రెస్ చేసి నన్ను పెళ్లి చేసుకోమని హీరోయిన్ డెడ్ లైన్ పెడితే.. నేను నేనుగానే ఉంటా మారను అంటూ హీరో ఏ ప్రయత్నమూ చేయకుండా హీరో బాధ్యత లేకుండా తిరగడం.. ఇవేవీ కూడా మింగుడు పడే విషయాలు కాదు. ఐతే వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తే ‘నేను లోకల్’ను ఎంజాయ్ చేయలేం. లాజిక్ గురించి ఆలోచించకుండా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే ‘నేను లోకల్’ ఆద్యంతం లలరిస్తుంది. వినోదంలో ముంచెత్తుతుంది.
కథగా చూసుకుంటే ‘నేను లోకల్’లో కొత్తదనం ఏమీ లేదు. ‘ఇడియట్’ దగ్గర్నుంచి ‘సినిమా చూపిస్త మావ’ వరకు చాలా సినిమాల్లో చూసిన కథే ఇందులోనూ కనిపిస్తుంది. నిజానికి కథ మాత్రమే కాదు.. పాత్రలు కూడా పైన చెప్పుకున్న సినిమాల తీరులోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నాని-కీర్తి ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇద్దరూ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాని తనదైన నటన.. కామెడీ టైమింగ్ తో వినోదం పంచుతూ ప్రేక్షకుల్ని చాలా వరకు ఎంగేజ్ చేస్తాడు. కీర్తి తన టిపికల్ అందంతో.. హావభావాలతో ఆకట్టుకుంటుంది. ఇక ట్రెండీగా అనిపించే సన్నివేశాలు.. డైలాగులు కావాల్సినంత కిక్కు ఇస్తాయి. సినిమాలో ఎక్కడా కూడా బోర్ కొట్టించే మూమెంట్ అన్నదే కనిపించదు. అసలీ కథ ఎటు పోతోందో.. ఎలా ముగుస్తుందో అని సందేహాలు రేకెత్తించే సన్నివేశాలు అక్కడక్కడా అడ్డం పడుతున్నా.. కథనం వినోదాత్మకంగా సాగిపోవడం ‘నేను లోకల్’కు ఉన్న పెద్ద ప్లస్.
ప్రథమార్ధం అంతా కూడా నాని షోనే కనిపిస్తుంది. అతడి పాత్ర వినోదం పంచుతుంది. నాని పాత్రకు కొంచెం హీరోయిజం పాళ్లు కూడా జోడించి మాస్ ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు త్రినాథరావు. సినిమాలో ఉన్న ఏకైక ఫైట్ ను కూడా అందరూ మెచ్చేలా ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు. ఇంటర్వెల్ ముంగిట హీరోయిన్ హీరోతో ప్రేమలో పడిపోయి.. అతడికి తన తన ప్రేమను చెప్పడానికి సిద్ధ సన్నివేశం యువ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతుంది.
సినిమాలో మొత్తంగా నాని-కీర్తి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం అలరిస్తుంది. ఐతే ఇంటర్వెల్ బ్యాంగ్ లో నవీన్ చంద్ర పాత్ర చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. ద్వితీయార్ధంలో అతడి పాత్ర నిరాశ పరుస్తుంది. తనను అపార్థం చేసుకున్న హీరోయిన్లో హీరో మార్పు తీసుకొచ్చే సీన్ మినహాయిస్తే ప్రి క్లైమాక్స్ వరకు ద్వితీయార్ధంలో మరీ మెరుపులేమీ లేకపోయినా.. సినిమాకు ముగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాని నటన.. డైలాగులు ఈ సన్నివేశానికి క్లైమాక్స్ కు బలంగా నిలిచాయి. చాలా ప్రశ్నలకు క్లైమాక్స్ సమాధానంగా నిలుస్తుంది. ప్రేక్షకులు నవ్వు ముఖాలతో థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది.
నటీనటులు:
నాని నటన గురించి చెప్పేదేముంది. ఎప్పట్లాగే బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో ఈజీగా ఒదిగిపోయాడు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నాని గత సినిమాల్లో మాదిరే కంటెంట్ మామూలుగానే ఉన్నా.. అతడి వల్ల సినిమా రేంజ్ పెరిగింది. క్లైమాక్స్ లో నాని చెలరేగిపోయాడు. కానీ డైలాగులు చెప్పడంలోనే కొన్ని చోట్ల కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది. మాటల విరుపుల్లో కొంచెం శ్రుతి మించేసిన భావన కలుగుతుంది. కీర్తి సురేష్ కొన్ని చోట్ల మరీ బొద్దుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా మంచి ఫీలింగే ఇస్తుంది. ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. ‘నేను శైలజ’ లాగే ట్రెడిషనల్ గర్ల్ క్యారెక్టర్ కు ఆమె సరిపోయింది. కానీ ఇలాంటి పాత్రలకైతే ఓకే కానీ.. కమర్షియల్ సినిమాలకు ఇలాంటి అవతారంతో ఆమె ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలైతే కలుగుతాయి. నవీన్ చంద్ర పాత్రకు సరిపోయాడు.. బాగానే చేశాడు కానీ.. అతడి పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. సచిన్ ఖేడ్కర్ పాత్ర కూడా అంతే. ఆయన బాగానే చేసినా.. ఆయనే చేయాల్సిన క్యారెక్టర్ కాదిది. పోసాని.. ఈశ్వరి రావు.. తులసి.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
‘నేను లోకల్’కు సాంకేతిక నిపుణులు బాగా ప్లస్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ ట్రెండీగా ఉండే మ్యూజిక్ ఇచ్చాడు. ‘నెక్స్ట్ ఏంటి’.. ‘ఎక్కడ ఎక్కడ’ పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. ఇవి రెండూ మంచి టైమింగ్ లో వస్తాయి సినిమాలో. మిగతా పాటలు జస్ట్ ఓకే. నేపథ్యం సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతటా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది అతడి కెమెరా పనితనం వల్ల. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రైటింగ్ లో ప్రసన్న కుమార్.. సాయికృష్ణ.. త్రినాథరావు.. ఈ ముగ్గురి పాత్రా ఉంది. కథ రొటీనే కానీ.. స్క్రీన్ ప్లే రేసీగా ఉండేలా చూసుకున్నారు. డైలాగులు ట్రెండీగా.. ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. దర్శకుడు త్రినాథరావు నేలవిడిచి సాము చేయలేదు. మామూలు కథతోనే ఎంటర్టైన్ చేశాడు. నానిని.. సాంకేతిక నిపుణుల్ని అతను సరిగ్గా వాడుకున్నాడు. కొంచెం ఇల్లాజికల్ గా కథను.. హీరో పాత్రను నడిపించినా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. యువతకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దాడు.
చివరగా: లోకల్ కుర్రాడు.. రొటీన్ గానే వినోదంలో ముంచెత్తాడు
రేటింగ్: 3/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre