స్టార్ ఫ్యామిలీ అండదండలతో సినిమాలలోకి అడుగుపెడుతున్నామంటే ఇన్స్టంట్ ఫ్యాన్ బేస్ లానే ఇన్ స్టంట్ హిట్ కోసం పరితపిస్తూవుంటారు. అందుకోసమే ఎంటర్ టైన్ మెంట్ చట్రంలో, కమర్షియల్ సూత్రంతో సినిమాలు తీస్తూ కెరీర్ ని కాలాన్ని నెట్టుకొచ్చేవారే ఎక్కువ. అయితే స్టార్ బ్యాక్ డ్రాప్ ఎలానో వుందికాబట్టి ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టిపెడితే రీచ్ ఎక్కువుంటుంది అని భావించేవారు తక్కువే.
అయితే టాలీవుడ్ బిగ్ సినీ ఫ్యామిలీస్ గా వర్ణింపబడే నందమూరి - మెగా ఫ్యామిలీలలో ఒక్కో యువహీరో ఈ రకమైన ప్రయోగాలను ఆహ్వానించడం విశేషం. నారా రోహిత్ వరుసపెట్టి కొత్త దర్శకులతో, కొత్త కధలతో ప్రేక్షకులకు పరిచయమవుతూ మెప్పిస్తున్నాడు. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు రోహిత్ సినిమాలకు పట్టం కడుతున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ చేతిలో ప్రస్తుతం ఎనిమిదికి పైగా సినిమాకు వున్నాయి.
ఇక మెగా ఫ్యామిలీ విషయానికొస్తే వరుణ్ తేజ్ కధల ఎంపికలో పరిణితి చూపిస్తున్నాడు. ముకుంద - కంచె లాంటి కధలను కెరీర్ మొదట్లోనే అందుకోవడం అదృష్టమైతే వాటిని అంగీకరించడం ఆనందకరం. ప్రస్తుతం పూరి 'లోఫర్'లో నటిస్తున్న వరుణ్ ఇలానే కొత్త కధలను అటెంప్ట్ చేస్తూ సరికొత్త బేస్ సృష్టించుకోవాలని కోరుకుందాం.