నందమూరి వారసుడికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన నారా వారి అబ్బాయి...!

Update: 2020-05-19 16:10 GMT
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి హీరోగా యాక్టింగ్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ - ఫైట్స్‌ లో రాణిస్తూ ఆల్‌ రౌండర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సింగర్‌ గానూ రాణిస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరో కాబట్టి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగరోజు. ఈ సందర్బంగా ప్రతి ఏడాది ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే గతేడాది తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు. తన తండ్రి హరికృష్ణ చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదని.. ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో అప్పుడు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేయలేదు. ఈ ఏడాది రెండు కలిపి చేయాలి అన్నట్లుగా అంగరంగ వైభవంగా ఇప్పుడు జరపాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

కానీ ఈ ఏడాది కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన అభిమానులు ఇంట్లోనే ఉంటూ సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని విన్నవించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు దూరం కానున్నారు. కాకపోతే తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నారా రోహిత్.. ఎన్టీఆర్‌ కోసం స్పెషల్ గిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇంతకముందు ప్రకటించాడు. నారా వారికి నందమూరి వారికి ఉన్న అవినాభావ సంబంధం గురించి మనందరికి తెలిసిందే.

మరికొన్ని గంటల్లో నందమూరి తారక రాముడి బర్త్ డే రానున్న నేపథ్యంలో అందరి కంటే ముందుగా నారా రోహిత్ బర్త్ డే విషెష్ చెప్పేసాడు. తాను చెప్పినట్లుగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసి శుభాకాంక్షలు తెలియజేసాడు. ట్విట్టర్ వేదికగా నారా రోహిత్ స్వయంగా ఎన్టీఆర్ ఫోటో డ్రా చేసి పోస్ట్ చేసాడు. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా మొండికత్తి పట్టుకొని నిలబడి ఉన్న ఫోజ్ ను స్కెచ్ రూపంలో బహుమతిగా అందించాడు నారా వారి అబ్బాయి రోహిత్. ఈ విధంగా తనలో దాగి ఉన్న టాలెంట్ బయటకి వెల్లడించాడు. ఈ సందర్భంగా నారా రోహిత్.. ''ఎవరో చెప్పినట్లు మాటలలో ఎక్సప్రెస్ చేయలేని విషయాలు కొన్ని ఆర్ట్ ద్వారా చెప్పవచ్చు. కాబట్టి తారక్ మీకు మీ ఫ్యాన్స్ కి ఒక చిన్న బహుమతి. హ్యాపీ బర్త్ డే తారక్'' అంటూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నారా రోహిత్ లో దాగి ఉన్న కళను కూడా అభినందిస్తున్నారు.
Tags:    

Similar News