‘ఒక్కడినే’ మినహాయిస్తే నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఫెయిల్యూర్ లేదు. అతడి సినిమాలు చాలా వరకు పెట్టుబడి వెనక్కి తెచ్చినవే. కొన్ని సినిమాలు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. ఐతే రోహిత్ కోరుకుంటున్న పెద్ద కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇంకా రాలేదు. ‘సోలో’ సినిమానే రోహిత్ కెరీర్ లో అతి పెద్ద కమర్షియల్ హిట్. దాన్ని కొట్టే సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు రోహిత్. ఆ కోరికను ‘సావిత్రి’ తీర్చేస్తుందన్న ఆశతో ఉన్నాడు నారా వారి అబ్బాయి. సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ ప్రకారం చూస్తే.. టాక్ బాగుంటే రోహిత్ ఆశ తీరడం పెద్ద కష్టమేమీ కాదు.
‘సావిత్రి’కి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ చిత్రం యూత్ ఫుల్ గానూ అనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్టయ్యేలా ఉంది. టీజర్.. ట్రైలర్.. పాటలు అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ శుక్రవారం రిలీజవుతున్న సినిమాల్లో అత్యంత ఆకర్షణీయ చిత్రం ‘సావిత్రి’నే అనడంలో సందేహం లేదు. పైగా సమ్మర్ సీజన్లో రిలీజవుతుండటంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నదే చూడాలి. గత వారం వచ్చిన ‘ఊపిరి’ బాగా ఆడుతున్నప్పటికీ.. వచ్చేవారం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజవుతున్నప్పటికీ సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఖాళీ ఉన్నది వారమే అయినా.. పోటీ చాలా ఎక్కువగా ఉన్నా.. మంచి టాక్ వస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తానని ఆశతో ఉన్నాడు రోహిత్. మరి అతడి ఆశ నెరవేరుతుందా?