మామూలుగా హిట్ కాంబినేషన్లు అనేవి హీరో-హీరోయిన్.. హీరో-దర్శకుడు.. దర్శకుడు-నిర్మాత.. ఇలా ఉంటాయి. ఐతే నారా రోహిత్ విషయంలో మాత్రం దీనికి భిన్నం. అతను తన స్నేహితుడైన నటుడు శ్రీవిష్ణుతో కాంబినేషన్లు రిపీట్ చేస్తుంటాడు. తొలి సినిమా ‘బాణం’ దగ్గర్నుంచి రోహిత్.. శ్రీవిష్ణుతో చాలాసార్లు కలిసి నటించాడు. చివరగా వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సూపర్ హిట్టయింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల ఆదరణా దక్కించుకుంది. ఇప్పుడు రోహిత్-శ్రీవిష్ణు కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు అసోసియేట్ గా పని చేసిన ఇంద్రసేన చెప్పిన లైన్ నచ్చడంతో నారా రోహిత్.. శ్రీవిష్ణు అతడి డైరెక్షన్లో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. బెల్లాన అప్పారావు అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. స్టార్ హీరోయిన్ శ్రియ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుందట. జ్యోతిలక్ష్మీ.. ఘాజీ లాంటి సినిమాల్లో నటించిన సత్యదేవ్ కూ ఓ ముఖ్య పాత్ర ఇచ్చారు. మరోవైపు రోహిత్ ‘కథలో రాజకుమారి’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఓ సినిమా.. పవన్ సాధినేనితో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. శ్రీవిష్ణు కూడా సోలో హీరోగా రెండు మూడు సినిమాలు లైన్లో పెడుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/