బ్రూస్ లీ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఖరారైపోయింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన తని ఒరువన్ రీమేక్ లోనే రామ్ చరణ్ నటించబోతున్నారు. ఇప్పటికే సురేందర్ రెడ్డి స్క్రిప్టు పనుల్ని చివరి దశకు చేర్చినట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అందులో విలన్ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. తమిళంలో విలన్ గా అరవింద్ స్వామి నటించిన విషయం తెలిసిందే. డిగ్నిఫైడ్ గా రూపుదిద్దుకొన్న ఆ విలన్ పాత్ర అరవింద్ స్వామికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ పాత్రకోసం ఎవర్ని ఎంపిక చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకొంటోంది చిత్రబృందం.
మొదట్లో నాగార్జున విలన్ గా నటిస్తాడని అన్నారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు నారా హీరో రోహిత్ కాగా మరొకరు కన్నడ నటుడు సుదీప్. కథానాయకుడిగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న నారా రోహిత్ పేరు వార్తల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలగించింది. కానీ చిత్రబృందం మాత్రం చరణ్ కి తగ్గట్టుగా నారా రోహిత్ అయితేనే బాగుంటుందని భావిస్తోందట. ఒకవేళ నారా రోహిత్ ఒప్పుకోకపోతే సుదీప్ ని అడగాలనుకొంటున్నారట. కథ నచ్చితే నారా రోహిత్ ఇతరత్రా విషయాలేవీ పట్టించుకోడు. కానీ నందమూరి అభిమానుల నుంచే ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చు. మరి చిత్రబృందం నారా రోహిత్ ని అప్రోచ్ అయిందా లేదా అన్నది తేలాల్సివుంది. ఈ సినిమాకోసం ఇప్పటికే కాజల్ ని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలిసింది. స్టైలిష్ గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పోలిసు పాత్రలో కనిపించబోతున్నారు. బ్రూస్ లీ విడుదలైన వెంటనే సినిమాకి కొబ్బరికాయ కొట్టే అవకాశాలున్నాయి.