యంగ్ హీరో నారా రోహిత్ తాజా చిత్రం 'ఆటగాళ్ళు' రేపు రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రోహిత్ తో పాటు జగపతి బాబు మరో కీలకపాత్రలో నటించిన ఈ సినిమాపై విజయంపై ధీమాగా ఉంది ఫిలిం యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రోహిత్ రీసెంట్ గా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దర్శకుడు పరుచూరి మురళి ఈ థ్రిల్లర్ డ్రామా ను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడని అంటున్నాడు రోహిత్.
ఒక ఇంటర్వ్యూ లో రోహిత్ కు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'ఎన్టీఆర్' సినిమాలో మీరు ఏదైనా పాత్రలో నటిస్తున్నారా? అని అడిగితే.. "సినిమాలో ఏదైనా పాత్రకు నేను సూట్ అయితే బాలయ్య గారే తప్పకుండా కాల్ చేస్తారు .. ఆ సినిమాలో నటించే అవకాశం వస్తే అంతకంటే సంతోషం లేదు. కానీ ఆ విషయంలో బాలయ్యదే తుది నిర్ణయం." ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది ప్రముఖనటులు నటిస్తున్నారు. బాలయ్యకు రోహిత్ అంటే అభిమానం కూడా ఉంది కాబట్టి అవకాశం తప్పనిసరిగా ఇస్తాడని టాక్ ఉంది.
ఇదిలా ఉంటే నారా రోహిత్ 'ఆటగాళ్ళు' సినిమా రేపు రిలీజ్ అవుతుంటే మరో చిత్రం 'వీరభోగ వసంత రాయలు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలు కాకుండా 'శబ్దం'.. 'మద్రాసి'.. 'అనగనగా దక్షిణాదిలో' కూడా లైన్ లో ఉన్నాయి.